Telugu Global
Others

కాలేజీల్లో డ్రెస్ కోడ్...నిర‌స‌న వెల్లువ‌

కోలకత్తాలోని స్కాటిష్ చర్చ్ కాలేజీ యాజమాన్యం విద్యార్థులకు డ్రెస్ కోడ్ విధిస్తూ నోటీసులు జారీ చేసింది. అబ్బాయిలు రౌండ్ నెక్ టీ షర్టులు, కాప్షన్స్, పిచ్చిరాతలు ఉన్న టాప్స్, అమ్మాయిలు పొట్టి గౌనులు ధరించి కాలేజీకి రావడాన్ని నిషేధించింది. విద్యార్థినీ విద్యార్థులు విధిగా పొడుగు చేతుల చొక్కాలు, చీరలు, సల్వార్ కమీజులు మొదలైన దుస్తులు ధరించి కళాశాలకు రావాలని సూచించింది. దీంతోపాటు అబ్బాయిలు చెవులకు రింగులు ధరించడాన్ని కూడా తప్పు బట్టింది. ఇక కళాశాల యాజమాన్యం నిర్ణయంపై […]

కోలకత్తాలోని స్కాటిష్ చర్చ్ కాలేజీ యాజమాన్యం విద్యార్థులకు డ్రెస్ కోడ్ విధిస్తూ నోటీసులు జారీ చేసింది. అబ్బాయిలు రౌండ్ నెక్ టీ షర్టులు, కాప్షన్స్, పిచ్చిరాతలు ఉన్న టాప్స్, అమ్మాయిలు పొట్టి గౌనులు ధరించి కాలేజీకి రావడాన్ని నిషేధించింది. విద్యార్థినీ విద్యార్థులు విధిగా పొడుగు చేతుల చొక్కాలు, చీరలు, సల్వార్ కమీజులు మొదలైన దుస్తులు ధరించి కళాశాలకు రావాలని సూచించింది. దీంతోపాటు అబ్బాయిలు చెవులకు రింగులు ధరించడాన్ని కూడా తప్పు బట్టింది. ఇక కళాశాల యాజమాన్యం నిర్ణయంపై విద్యార్థి సంఘాలు ఆందోళన దిగాయి. త‌మ‌ను మాట మాత్రంగానైనా సంప్ర‌దించ‌కుండా ఇలా చేయ‌డం స‌హించ‌మ‌ని హెచ్చ‌రించాయి. మరోవైపు ఈ రోజుల్లో కూడా ఇంకా ఇలాంటి అనాగరిక నిబంధనలా అంటూ మేధావులు విమర్శిస్తున్నారు. విద్యార్థుల స్వేచ్ఛా స్వాత్యంత్ర్యాలకు ఇది తీరని భంగపాటు అంటూ అనేకమంది విద్యావేత్తలు ఉద్యమకారులు విరుచుకుపడుతున్నారు.

First Published:  29 Jun 2015 1:11 PM GMT
Next Story