Telugu Global
Cinema & Entertainment

అమెరికాలో బాహుబలి సంచలనాలు

అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, హైటెక్ ఆడియో ఎఫెక్ట్స్ తో తెరకెక్కుతున్న బాహుబలి సినిమాను హైటెక్ థియేటర్లలో చూస్తే ఆ మజానే వేరు. బిగ్ స్క్రీన్స్ ఇండియాలో చాలా తక్కువ. కానీ అమెరికాలో చాలా ఉన్నాయి. అయితే తెలుగు సినిమాలకు బిగ్ స్క్రీన్స్ కేటాయించరు అక్కడ. అలాంటిది బాహుబలి కోసం ఏకంగా 10 ఎక్స్ డీ తెరల్ని కేటాయించారు. ప్రపంచంలోనే అతిపెద్ద స్క్రీన్స్ ను ఎక్స్ డీ తెరలుగా వ్యవహరిస్తారు. అలాంటి సిల్వర్ స్క్రీన్స్ ను పదిని కేటాయించారు […]

అమెరికాలో బాహుబలి సంచలనాలు
X
అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, హైటెక్ ఆడియో ఎఫెక్ట్స్ తో తెరకెక్కుతున్న బాహుబలి సినిమాను హైటెక్ థియేటర్లలో చూస్తే ఆ మజానే వేరు. బిగ్ స్క్రీన్స్ ఇండియాలో చాలా తక్కువ. కానీ అమెరికాలో చాలా ఉన్నాయి. అయితే తెలుగు సినిమాలకు బిగ్ స్క్రీన్స్ కేటాయించరు అక్కడ. అలాంటిది బాహుబలి కోసం ఏకంగా 10 ఎక్స్ డీ తెరల్ని కేటాయించారు. ప్రపంచంలోనే అతిపెద్ద స్క్రీన్స్ ను ఎక్స్ డీ తెరలుగా వ్యవహరిస్తారు. అలాంటి సిల్వర్ స్క్రీన్స్ ను పదిని కేటాయించారు బాహుబలి కోసం. వీటిలో సౌండ్ సిస్టమ్ కూడా అత్యాధునికంగా ఉంటుంది. పైగా ఎన్నడూ లేని విధంగా అమెరికాలో బాహుబలి ప్రీమియర్ ను ఏకంగా 2వందల లొకేషన్లలో ఏర్పాటుచేశారు. తెలుగు, తమిళ భాషల్లో ఈ 2వందల లొకేషన్లలో బాహుబలి ప్రీమియర్ ను నిర్వహిస్తారు. ఇండియాలో జులై 10న విడుదలకాబోతున్న బాహుబలి మూవీని, ఒక రోజు ముందే అంటే జులై 9న యూఎస్ఏలో ప్రదర్శిస్తారు. జులై 1 నుంచి అమెరికాలో ఆన్ లైన్ టికెట్ రిజర్వేషన్ మొదలవుతుంది. ఈ సినిమాకు అమెరికాలో కూడా భారీగా ప్రమోషన్ కల్పిస్తున్నారు. కుదిరితే ఓ వీకెండ్ ప్రభాస్ కూడా అమెరికా వెళ్లే అవకాశముంది.
First Published:  30 Jun 2015 3:36 AM GMT
Next Story