Telugu Global
Family

జర నవ్వండి ప్లీజ్ 128

రాజా స్కూల్‌ నించి వచ్చి “మమ్మీ! నేను మా క్లాసులో సెకండ్‌ ర్యాంక్‌. ఒకమ్మాయి ఫస్ట్‌ర్యాంక్‌ వచ్చింది”. “మరి నీకు ఆ అమ్మాయిని బీట్‌ చేసి ఫస్టు రావాలని లేదా?” తల్లి “లేదు మమ్మీ! లేడీస్‌ ఫస్ట్‌!” అన్నారు కదా! —————————————————————————— రవి ఏడుస్తూ వచ్చాడు “ఎందుకు నాన్నా ఏడుస్తున్నావు?” అని తల్లి దగ్గరికి తీసుకుంది. “నాన్న గోడకు చీల కొడుతూవుంటే పొరపాటున సుత్తితో వేలు మీద కొట్టుకున్నాడు మమ్మీ” అన్నాడు రాజు. “సుత్తితో వేలుమీద కొట్టుకుంటే […]

రాజా స్కూల్‌ నించి వచ్చి “మమ్మీ! నేను మా క్లాసులో సెకండ్‌ ర్యాంక్‌. ఒకమ్మాయి ఫస్ట్‌ర్యాంక్‌ వచ్చింది”.
“మరి నీకు ఆ అమ్మాయిని బీట్‌ చేసి ఫస్టు రావాలని లేదా?” తల్లి
“లేదు మమ్మీ! లేడీస్‌ ఫస్ట్‌!” అన్నారు కదా!
——————————————————————————
రవి ఏడుస్తూ వచ్చాడు
“ఎందుకు నాన్నా ఏడుస్తున్నావు?” అని తల్లి దగ్గరికి తీసుకుంది.
“నాన్న గోడకు చీల కొడుతూవుంటే పొరపాటున సుత్తితో వేలు మీద కొట్టుకున్నాడు మమ్మీ” అన్నాడు రాజు.
“సుత్తితో వేలుమీద కొట్టుకుంటే నవ్వాలి కానీ ఏడుస్తున్నావెందుకు?”
“అది చూసి నేను నవ్వాను మమ్మీ!” అన్నాడు కళ్ళు తుడుచుకుంటూ.
——————————————————————————
ఇంటికి వచ్చిన అతిథి: అమ్మాయ్‌! నీ స్వరం అంత బాగా లేనప్పుడు నువ్వెందుకు పాడతావు?
అమ్మాయి: నాకేమీ పాడాలని ఉండదంకుల్‌. ఇంటికి వచ్చినవాళ్ళు వెళ్ళిపోవాలనుకున్నప్పుడల్లా మమ్మీ నన్ను పాడమంటుంది.
——————————————————————————
అర్ధరాత్రి దొంగ రామారావు ఇంట్లోకి జొరబడ్డాడు. అలికిడి వచ్చి రామారావు లేచాడు. లేచిన రామారావును చూసి దొంగ “కదిలావంటే కాల్చేస్తాను. నేను చంపడానికి రాలేదు. నీ ఇంట్లో ఉన్న డబ్బుకోసం వచ్చాను” అన్నాడు. రామారావు “ఐతే మరీ మంచిది. చీకటిగా ఉంది లైటు వెయ్యనివ్వు ఇద్దరం కలిసి వెతుకుదాం” అన్నాడు.

First Published:  28 Jun 2015 1:03 PM GMT
Next Story