Telugu Global
Cinema & Entertainment

సంపు రూటే సపరేటు...!

క్రేజ్ అనుకోకుండా వస్తుంది. కానీ వచ్చిన క్రేజ్ ను నిలబెట్టుకోవడంలే టాలెంట్ ఉంటుంది. ప్రస్తుతం సంపూర్ణేష్ బాబు అదే పనిలో ఉన్నాడు. హృదయకాలేయం సినిమాతో ఊహించని క్రేజ్ సంపాదించుకున్నాడు సంపూ. ఆ తర్వాత ఇప్పటికీ అదే క్రేజ్ ను కొనసాగిస్తున్నాడు. తాజాగా సింగం123 విడుదల చేశాడు. రీసెంట్ గా వేర్ ఈజ్ విద్యాబాలన్ అనే సినిమాలో కూడా నటించాడు. సినిమా ఆఫర్లు బాగానే వస్తున్నాయి.. క్రేజ్ కూడా ఉంది. ఇక్కడే ఓ షాకింగ్ డెసిషన్ తీసుకున్నాడు సంపూర్ణేష్ […]

సంపు రూటే సపరేటు...!
X

క్రేజ్ అనుకోకుండా వస్తుంది. కానీ వచ్చిన క్రేజ్ ను నిలబెట్టుకోవడంలే టాలెంట్ ఉంటుంది. ప్రస్తుతం సంపూర్ణేష్ బాబు అదే పనిలో ఉన్నాడు. హృదయకాలేయం సినిమాతో ఊహించని క్రేజ్ సంపాదించుకున్నాడు సంపూ. ఆ తర్వాత ఇప్పటికీ అదే క్రేజ్ ను కొనసాగిస్తున్నాడు. తాజాగా సింగం123 విడుదల చేశాడు. రీసెంట్ గా వేర్ ఈజ్ విద్యాబాలన్ అనే సినిమాలో కూడా నటించాడు. సినిమా ఆఫర్లు బాగానే వస్తున్నాయి.. క్రేజ్ కూడా ఉంది. ఇక్కడే ఓ షాకింగ్ డెసిషన్ తీసుకున్నాడు సంపూర్ణేష్ బాబు. ఎక్కడ పడితే అక్కడ కనిపించనని, ఎవరికి పడితే వాళ్లకు ఇంటర్వ్యూలు ఇవ్వనని కరాఖండింగా చెప్పేశాడు. పబ్లిసిటీకి దూరంగా ఉంటా.. నా కెరీర్ కు ఉపయోగపడుతుందనుకుంటే నేను ముందుకొస్తా.. లేదంటే మొహమాటం లేకుండా చెప్పేస్తా.. ఇది సంపూర్ణేష్ మాట. ఈ విషయాన్ని స్వయంగా ట్విట్టర్ లో చెప్పుకొచ్చాడు సంపూ. దీనంతటికీ ఓ కారణం ఉంది. ఈమధ్య ఓ టీవీ ఛానెల్ సంపూను లైవ్ లో కూర్చోబెట్టింది. ఆ తర్వాత చాలామంది అదే పనిచేశారు. తర్వాత వీకెండ్ వచ్చిన ప్రతిసారి సంపూను పిలవడం మొదలుపెట్టారు. అనవసర పబ్లిసిటీతో మొదటికే మోసం వస్తుందని భావించిన సంపూ ఈ కీలక నిర్ణయం తీసుకున్నాడు.

First Published:  28 Jun 2015 11:00 PM GMT
Next Story