Telugu Global
Cinema & Entertainment

సమంత, శృతిహాసన్ మధ్య చిచ్చు

కొన్ని విషయాలు చూడ్డానికి చాలా చిన్నవిగా ఉంటాయి. కానీ పెద్ద అగాధాన్ని సృష్టిస్తాయి. ప్రస్తుతం సమంత, శృతిహాసన్ విషయంలో ఇదే జరిగింది. 62వ ఫిలింఫేర్ అవార్డులు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ అవార్డుల్లో బెస్ట్ హీరోయిన్ కేటగిరీలో సమంత, శృతిహాసన్ ఇద్దరూ నామినేట్ అయ్యారు. రేసుగుర్రం సినిమాకు గాను శృతిహాసన్, మనం సినిమాకు గాను సమంత బెస్ట్ హీరోయిన్ విభాగంలో ఎంపికయ్యారు. సాధారణంగా ఎవరైనా సమంతాకే ఓటేస్తారు. ఎందుకుంటే.. రెండు-మూడు వేరియేషన్లు, రెండు జన్మలు కలగలిపిన పాత్రలో […]

సమంత, శృతిహాసన్ మధ్య చిచ్చు
X
కొన్ని విషయాలు చూడ్డానికి చాలా చిన్నవిగా ఉంటాయి. కానీ పెద్ద అగాధాన్ని సృష్టిస్తాయి. ప్రస్తుతం సమంత, శృతిహాసన్ విషయంలో ఇదే జరిగింది. 62వ ఫిలింఫేర్ అవార్డులు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ అవార్డుల్లో బెస్ట్ హీరోయిన్ కేటగిరీలో సమంత, శృతిహాసన్ ఇద్దరూ నామినేట్ అయ్యారు. రేసుగుర్రం సినిమాకు గాను శృతిహాసన్, మనం సినిమాకు గాను సమంత బెస్ట్ హీరోయిన్ విభాగంలో ఎంపికయ్యారు. సాధారణంగా ఎవరైనా సమంతాకే ఓటేస్తారు. ఎందుకుంటే.. రెండు-మూడు వేరియేషన్లు, రెండు జన్మలు కలగలిపిన పాత్రలో సమంత అద్భుతంగా నటించింది. కచ్చితంగా మనం సినిమాకు కూడా ఉత్తమ నటిగా సమంతాకే అవార్డు వస్తుందని అంతా భావించారు. కానీ అనూహ్యంగా రేసుగుర్రం సినిమాకు గాను శృతిహాసన్ ను బెస్ట్ హీరోయిన్ గా ఎంపికచేశారు. నిజానికి సమంతతో పోలిస్తే, రేసుగుర్రంలో శృతి పాత్ర నిడివి చాలా చిన్నది. పైగా ఒకట్రెండ్ సన్నివేశాలు మినహా ఆమె నటించింది చాలా తక్కువ. అయినా శృతికే అవార్డు దక్కింది. దీంతో సమంత చాలా ఫీలైంది. చాలా అవార్డులనేవి తెరవెనక జరిగే వ్యవహారాన్ని బట్టి ఇస్తుంటారనేది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యమే అయినప్పటికీ.. ఈ విషయం శృతి-సమంతల మధ్య గ్యాప్ పెంచేసింది.
First Published:  28 Jun 2015 10:30 PM GMT
Next Story