Telugu Global
Others

మ‌రోసారి నాలుక్క‌రుచుకున్న కామ్రేడ్లు!

ఎమర్జెన్సీకి మ‌ద్ద‌తు త‌ప్పేన‌ని సీపీఐ ఆత్మ‌విమ‌ర్శ‌ పొర‌పాట్లు చేయ‌డం ఆన‌క నాలుక్క‌రుచుకోవ‌డం కామ్రేడ్ల‌కు ప‌రిపాటి అని ప్ర‌త్య‌ర్థిపార్టీలు ఎద్దేవా చేస్తుంటాయి. అది అక్ష‌రాలా నిజ‌మేన‌ని కామ్రేడ్లూ త‌ర‌చూ నిరూపించుకుంటుంటారు. జ్యోతిబ‌సుకు ప్ర‌ధాని ప‌ద‌వి తిర‌స్క‌రించ‌డం చారిత్ర‌క త‌ప్పిద‌మేన‌ని ఇటీవ‌లే సీపీఎం ఆత్మ విమ‌ర్శ చేసుకోగా ఇపుడు సీపీఐ వంతు వ‌చ్చింది.  నలభై ఏళ్ళ క్రితం ఎమర్జన్సీకి మద్దతు తెలిపి తప్పు చేసామని సిపిఐ నాయకత్వం అభిప్రాయ పడింది. అది ఒక రాజకీయ తప్పిదమని పేర్కొంది. సిపిఐ ప్రధాన […]

మ‌రోసారి నాలుక్క‌రుచుకున్న కామ్రేడ్లు!
X
ఎమర్జెన్సీకి మ‌ద్ద‌తు త‌ప్పేన‌ని సీపీఐ ఆత్మ‌విమ‌ర్శ‌
పొర‌పాట్లు చేయ‌డం ఆన‌క నాలుక్క‌రుచుకోవ‌డం కామ్రేడ్ల‌కు ప‌రిపాటి అని ప్ర‌త్య‌ర్థిపార్టీలు ఎద్దేవా చేస్తుంటాయి. అది అక్ష‌రాలా నిజ‌మేన‌ని కామ్రేడ్లూ త‌ర‌చూ నిరూపించుకుంటుంటారు. జ్యోతిబ‌సుకు ప్ర‌ధాని ప‌ద‌వి తిర‌స్క‌రించ‌డం చారిత్ర‌క త‌ప్పిద‌మేన‌ని ఇటీవ‌లే సీపీఎం ఆత్మ విమ‌ర్శ చేసుకోగా ఇపుడు సీపీఐ వంతు వ‌చ్చింది. నలభై ఏళ్ళ క్రితం ఎమర్జన్సీకి మద్దతు తెలిపి తప్పు చేసామని సిపిఐ నాయకత్వం అభిప్రాయ పడింది. అది ఒక రాజకీయ తప్పిదమని పేర్కొంది. సిపిఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర రెడ్డి మాట్లాడుతూ, ఎమర్జెన్సీకి మద్దతివ్వడం ద్వారా రాజకీయ వాస్తవికతను అర్ధం చేసుకోవడంలో పార్టీ విఫలమైందని అన్నారు. మరో నేత గురుదాస్‌ దాస్‌గుప్తా మాట్లాడుతూ ఇది చాలా తీవ్రమైన రాజకీయ తప్పిదమని వ్యాఖ్యానించారు. ”మేం తప్పు చేశాం. ఎమర్జెన్సీ విధించడం ద్వారా మితవాద ప్రతీఘాత శక్తులను ఓడించవచ్చని మేం భావించాం. కానీ అది నియంతృ త్వంలా ఆవిర్భవించింది.” అని సుధాకర రెడ్డి పేర్కొన్నారు. ఎమర్జెన్సీ విధించిన రోజుల్లో చిన్న రాజకీయ కార్యకలాపాలు కూడా అనుమతించలేదు. అయినప్పటికీ కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా తాము దాన్ని వ్యతిరేకించామని దాస్‌గుప్తా చెప్పారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తున్న తీరు పట్ల సుధాకర రెడ్డి, దాస్‌గుప్తా ఇరువురూ కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల బిజెపి అగ్ర నేత అద్వానీ వెలిబుచ్చిన ఆందోళనలను తేలిగ్గా కొట్టిపారేయలేమని సుధాకర రెడ్డి అన్నారు. కేంద్ర మంత్రివర్గ సభ్యులకు కూడా తమ అభిప్రాయాలను వెలిబుచ్చే స్వేచ్ఛ లేదంటేనే ప్రస్తుత ప్రభుత్వం నియంతృత్వ ధోరణులను గురించి అర్ధం చేసుకోవచ్చునని సుధాకర రెడ్డి అన్నారు. అయితే మళ్ళీ ఎమర్జెన్సీ విధించే అవకాశాలను దాస్‌గుప్తా తోసిపుచ్చారు. ఎమర్జెన్సీ విధింపు నుండి దేశం గుణపాఠాలు నేర్చుకుందన్నారు. అందువల్ల మళ్ళీ అత్యవసర పరిస్థితిని విధించడం అంత తేలిక కాదని అన్నారు.
First Published:  28 Jun 2015 12:22 AM GMT
Next Story