Telugu Global
Cinema & Entertainment

ఇండస్ట్రీని ఆకర్షించిన సోనారికా

ఎడారిలో ఒయాసిస్సులా జాదుగాడు యూనిట్ కు ఇప్పుడు సోనారికా దిక్కయింది. శుక్రవారం విడుదలైన ఈ సినిమాపై నెగెటివ్ కామెంట్స్ ఎక్కువగా వినిపించాయి. సినిమాను రెండున్నర గంటల పాటు కూర్చొని చూడ్డం కష్టమన్నారు. నాగశౌర్య చాలా చలాకీగా యాక్ట్ చేసినప్పటికీ సెకెండాఫ్ లో ఏదో మిస్సయిన ఫీలింగ్ ఆడియన్స్ కు కలిగింది. ఇంత డ్యామేజ్ జరిగినా జాదుగాడు సినిమాను ఓసారి చూడొచ్చని సగటు ప్రేక్షకుడు అంటున్నాడంటే దానికి కారణం జాదూగాడు సినిమా హీరోయిన్ సోనారికా. అవును.. సోనారికాను 70ఎమ్ఎమ్ […]

ఇండస్ట్రీని ఆకర్షించిన సోనారికా
X
ఎడారిలో ఒయాసిస్సులా జాదుగాడు యూనిట్ కు ఇప్పుడు సోనారికా దిక్కయింది. శుక్రవారం విడుదలైన ఈ సినిమాపై నెగెటివ్ కామెంట్స్ ఎక్కువగా వినిపించాయి. సినిమాను రెండున్నర గంటల పాటు కూర్చొని చూడ్డం కష్టమన్నారు. నాగశౌర్య చాలా చలాకీగా యాక్ట్ చేసినప్పటికీ సెకెండాఫ్ లో ఏదో మిస్సయిన ఫీలింగ్ ఆడియన్స్ కు కలిగింది. ఇంత డ్యామేజ్ జరిగినా జాదుగాడు సినిమాను ఓసారి చూడొచ్చని సగటు ప్రేక్షకుడు అంటున్నాడంటే దానికి కారణం జాదూగాడు సినిమా హీరోయిన్ సోనారికా. అవును.. సోనారికాను 70ఎమ్ఎమ్ లో చూసేందుకు ఇప్పుడు కుర్రకారు ఎగబడుతోంది. ఇంతకుముందు పోస్టర్లు, ట్రయిలర్లలో చూపించిన దానికి వందశాతం న్యాయం చేసింది సోనారికా. థియేటర్లకు వచ్చిన కుర్రకారును ఎక్కడా డిసప్పాయింట్ చేయలేదు. సినిమాలో ఏకంగా 3 లిప్ కిస్సులున్నాయంటే సోనారికా ఏ రేంజ్ లో రెచ్చిపోయి నటించిందో అర్థంచేసుకోవచ్చు. పైగా ఫేస్ వాల్యూ కూడా ఉండడంతో ఆమె లుక్స్ కు కుర్రాళ్లు ఫిదా అయిపోయారు. ఆడియన్స్ తో పాటు ఒకేఒక్క సినిమాతో టోటల్ ఇండస్ట్రీని ఆకర్షించింది సోనారికా. మరి జాదూగాడు సినిమా ఆమె కెరీర్ కు ఎంత ప్లస్ అవుతుందో చూడాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.
First Published:  26 Jun 2015 7:12 PM GMT
Next Story