Telugu Global
Others

శ్రీ‌నివాసుడికి నాణ్య‌త‌లేని చ‌క్కెర... వెన‌క్కి త‌ర‌లింపు

దేవదేవుడు శ్రీ‌వేంక‌టేశ్వ‌ర స్వామికి నైవేద్యంగా నివేదించే లడ్డూ తయారీకి వినియోగించే ముడిసరుకుల్లో నాణ్యత లేదంటూ కాంట్రాక్టర్లు పంపిన 11 లారీల చక్కెర, రెండు లారీల పచ్చి శెనగపప్పు వెన‌క్కి పంపింది. టెండర్ నిబంధనల ప్రకారం నాణ్యత లేదని గుర్తించిన అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. టీటీడీకి 11 లారీల్లో వచ్చిన 231 టన్నుల చక్కెర కర్ణాటకలోని భాగల్‌కోట్ జిల్లా మోదోల్‌కు చెందిన ఓ కాంట్రాక్టర్ నుంచి వచ్చింది. ప్రసాదం తయారీకి వచ్చిన చక్కెర‌కు టీటీడీ ల్యాబ్‌లో పరీక్షలు […]

దేవదేవుడు శ్రీ‌వేంక‌టేశ్వ‌ర స్వామికి నైవేద్యంగా నివేదించే లడ్డూ తయారీకి వినియోగించే ముడిసరుకుల్లో నాణ్యత లేదంటూ కాంట్రాక్టర్లు పంపిన 11 లారీల చక్కెర, రెండు లారీల పచ్చి శెనగపప్పు వెన‌క్కి పంపింది. టెండర్ నిబంధనల ప్రకారం నాణ్యత లేదని గుర్తించిన అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. టీటీడీకి 11 లారీల్లో వచ్చిన 231 టన్నుల చక్కెర కర్ణాటకలోని భాగల్‌కోట్ జిల్లా మోదోల్‌కు చెందిన ఓ కాంట్రాక్టర్ నుంచి వచ్చింది. ప్రసాదం తయారీకి వచ్చిన చక్కెర‌కు టీటీడీ ల్యాబ్‌లో పరీక్షలు జరిపిన అధికారులు టెండర్ మేరకు నాణ్యత లేదని నిర్ధారించారు. అలాగే హైదరాబాద్ నుంచి వచ్చిన పచ్చి శెనగ‌పప్పులో కూడా నాణ్యత లేదని గుర్తించారు. నాణ్యత లేని ముడిసరుకును వెనక్కి పంపించడం టీటీడీ చరిత్రలో ఇదే తొలిసార‌ని అధికారులు చెబుతున్నారు.
First Published:  26 Jun 2015 1:07 PM GMT
Next Story