Telugu Global
NEWS

టేపుల్లోని నిందితులకు నోటీసులు!

ఓటుకు నోటు కేసు నిర్ణయాత్మక దశకు చేరుకుంది. ఆడియో, వీడియో టేపుల కాపీని కోర్టు అప్పగించిన నేపథ్యంలో ఏసీబీ అధికారులు శుక్రవారం అర్ధరాత్రి భేటీ అయ్యారు. ఈ భేటీలో టేపుల విశ్లేషణ కోసం సైబర్ నిపుణుల సాయం తీసుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇందుకోసం మూడు ప్రత్యేక బృందాల సాయం తీసుకోనున్నట్లు తెలుస్తుంది. వాయిస్ టెస్టుకు కూడా అన్ని ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయని తెలిసింది. అదే సమయంలో ఈ విచారణ బృందంలో ఉన్న అధికారులను సమాచారం లీకైతే కఠిన […]

టేపుల్లోని నిందితులకు నోటీసులు!
X

ఓటుకు నోటు కేసు నిర్ణయాత్మక దశకు చేరుకుంది. ఆడియో, వీడియో టేపుల కాపీని కోర్టు అప్పగించిన నేపథ్యంలో ఏసీబీ అధికారులు శుక్రవారం అర్ధరాత్రి భేటీ అయ్యారు. ఈ భేటీలో టేపుల విశ్లేషణ కోసం సైబర్ నిపుణుల సాయం తీసుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇందుకోసం మూడు ప్రత్యేక బృందాల సాయం తీసుకోనున్నట్లు తెలుస్తుంది. వాయిస్ టెస్టుకు కూడా అన్ని ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయని తెలిసింది. అదే సమయంలో ఈ విచారణ బృందంలో ఉన్న అధికారులను సమాచారం లీకైతే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించినట్లు తెలిసింది. దీంతో రెండు, మూడు రోజుల్లో నిందితులందరికీ నోటీసులు వెళ్లే అవకాశాలు ఉన్నాయన్న మాట. స్టీఫెన్సన్ ఇప్పటికే చంద్రబాబు తనతో మాట్లాడారని కోర్టుకు వాంగ్మూలం ఇచ్చారు. ఫోరెన్సిక్ నివేదిక కూడా ఎలాంటి ట్యాపింగ్ జరగలేదని తేల్చింది. ఈ ఉత్సాహంతో ఏసీబీ దర్యాప్తు వేగవంతం చేసింది. కోర్టు ఇచ్చిన టేపులు, హార్డ్ డిస్క్ విశ్లేషణ పూర్తి అయ్యేందుకు మరో రెండు మూడు రోజులు పడుతుంది. దాని తరువాత కేసు మరిన్ని మలుపులు తిరగనున్నట్లు సమాచారం.

First Published:  26 Jun 2015 11:45 PM GMT
Next Story