Telugu Global
Others

'దొంగ' పోలీసు రిపోర్ట‌ర్లు!

విశాఖ‌ప‌ట్నంలోని వడ్డాది జంక్షన్‌లో గంజాయి అక్రమ రవాణా జ‌రుగుతోందంటూ న‌లుగ‌రు పోలీసులు కాప‌లా కాస్తున్నారు. ఈ న‌లుగురూ వ‌చ్చేపోయే వాహ‌నాల‌ను ఆపుతూ త‌నిఖీలు చేయ‌డం ప్రారంభించారు. గంజాయి వంటిదేమీ లేక‌పోయినా వాహ‌నదారుల‌ను బెదిరించి డ‌బ్బులు వ‌సూలు చేస్తూ అందిన‌కాడికి దండుకుని వాహ‌నాల‌ను వ‌దిలి వేస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే ఈ పోలీసులకు స్పెష‌ల్ బ్రాంచికి చెందిన పోలీసులు తారస ప‌డ్డారు. వీరు యూనిఫాంలో ఉండ‌రు కాబ‌ట్టి గుర్తు ప‌ట్ట‌లేక‌పోయారు. వారిని కూడా అంద‌రి మాదిరిగానే ఆపి వాహ‌నాన్ని త‌నిఖీ […]

విశాఖ‌ప‌ట్నంలోని వడ్డాది జంక్షన్‌లో గంజాయి అక్రమ రవాణా జ‌రుగుతోందంటూ న‌లుగ‌రు పోలీసులు కాప‌లా కాస్తున్నారు. ఈ న‌లుగురూ వ‌చ్చేపోయే వాహ‌నాల‌ను ఆపుతూ త‌నిఖీలు చేయ‌డం ప్రారంభించారు. గంజాయి వంటిదేమీ లేక‌పోయినా వాహ‌నదారుల‌ను బెదిరించి డ‌బ్బులు వ‌సూలు చేస్తూ అందిన‌కాడికి దండుకుని వాహ‌నాల‌ను వ‌దిలి వేస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే ఈ పోలీసులకు స్పెష‌ల్ బ్రాంచికి చెందిన పోలీసులు తారస ప‌డ్డారు. వీరు యూనిఫాంలో ఉండ‌రు కాబ‌ట్టి గుర్తు ప‌ట్ట‌లేక‌పోయారు. వారిని కూడా అంద‌రి మాదిరిగానే ఆపి వాహ‌నాన్ని త‌నిఖీ చేశారు. గంజాయి వంటిదేమీ లేద‌ని తెలుసుకున్న త‌ర్వాత వ‌సూళ్ళ‌కు చేయి చాపారు. అంతే అప్పుడ‌ర్ధ‌మ‌య్యింది వారికి… ఆ వాహ‌నంలో ఉన్న‌ది స్పెష‌ల్ బ్రాంచి పోలీసుల‌ని. ఈ న‌లుగురిలో ఇద్ద‌ర్ని ప‌ట్టుకుని ప్ర‌శ్నించారు… నీళ్ళు న‌ములుతుంటే నిల‌దీశారు… ఇంత‌కీ అస‌లు నిజం ఏమిటంటే.. వాహ‌నంలో వ‌చ్చింది స్పెష‌ల్ బ్రాంచ్ పోలీసులే కాని ఇక్క‌డ పోలీసు వేషాల్లో ఉన్న వాళ్ళు మాత్రం పోలీసులు కాదు… నిజానికి వారంతా ఎల‌క్ట్రానిక్ మీడియాలో ప‌ని చేసే రిపోర్ట‌ర్లు. మొత్తం న‌లుగురిలో ఇద్ద‌రు పారిపోగా ఇద్ద‌రు అడ్డంగా దొరికిపోయారు. ఈ ఇద్దరు రిపోర్టర్లను అదుపులోకి తీసుకొని చోడవరం పోలీసు స్టేషనుకు తరలించారు. మరో ఇద్దరు విలేకరుల గురించి ఆరా తీస్తున్నారు.

First Published:  25 Jun 2015 1:22 PM GMT
Next Story