Telugu Global
Cinema & Entertainment

బాహుబలి బ్యాచ్ లో చేరిన మహేష్

బాహుబలి సినిమాను మెచ్చుకుంటున్న వర్గంలోకి ఇప్పుడు మహేష్ కూడా చేరిపోయాడు. మొన్నటికి మొన్న ఈ ప్రాజెక్టును అమితాబ్ బచ్చన్ ఆకాశానికెత్తేస్తే, ఇప్పుడు మహేష్ కూడా అదే బాటపట్టాడు. బాహుబలి లాంటి బిగ్ బడ్జెట్ మూవీని అంతా కలిసి సపోర్ట్ చేయాలంటున్నాడు.  కేవలం ఆ సినిమాకు పోటీ ఇవ్వకూడదనే ఉద్దేశంతోనే తమ  శ్రీమంతుడు సినిమాను వాయిదా వేసుకున్నామని కూడా నిగర్వంగా ప్రకటించాడు. నిజానికి బాహుబలి విడుదలైన వారం రోజుల గ్యాప్ లో శ్రీమంతుడు విడుదలకావాల్సి ఉంది. కానీ రెండు […]

బాహుబలి బ్యాచ్ లో చేరిన మహేష్
X
బాహుబలి సినిమాను మెచ్చుకుంటున్న వర్గంలోకి ఇప్పుడు మహేష్ కూడా చేరిపోయాడు. మొన్నటికి మొన్న ఈ ప్రాజెక్టును అమితాబ్ బచ్చన్ ఆకాశానికెత్తేస్తే, ఇప్పుడు మహేష్ కూడా అదే బాటపట్టాడు. బాహుబలి లాంటి బిగ్ బడ్జెట్ మూవీని అంతా కలిసి సపోర్ట్ చేయాలంటున్నాడు. కేవలం ఆ సినిమాకు పోటీ ఇవ్వకూడదనే ఉద్దేశంతోనే తమ శ్రీమంతుడు సినిమాను వాయిదా వేసుకున్నామని కూడా నిగర్వంగా ప్రకటించాడు. నిజానికి బాహుబలి విడుదలైన వారం రోజుల గ్యాప్ లో శ్రీమంతుడు విడుదలకావాల్సి ఉంది. కానీ రెండు పెద్ద సినిమాలు ఒకేసారి విడుదలైతే వసూళ్లు కచ్చితంగా దెబ్బతింటాయి. అలా అని ఇప్పటికే ఒకసారి పోస్ట్ పోన్ అయిన బాహుబలిని మరోసారి వాయిదా వేయలేరు. పైగా అంతర్జాతీయ స్థాయిలో విడుదలవుతున్న సినిమా కాబట్టి వాయిదా సాధ్యం కాలేదు. దీంతో మహేష్ ముందుకొచ్చాడు. పెద్దమనసుతో తన సినిమా విడుదలను వాయిదా వేసుకున్నాడు.
First Published:  25 Jun 2015 11:46 PM GMT
Next Story