Telugu Global
Others

సెల్ఫీ పిచ్చి ప్రాణాలు తీస్తోంది

సెల్ఫీల‌తో సెల్ఫ్‌ గోల్       ఎవ‌రి చేతిలో చూసినా స్మార్ట్‌ఫోన్‌. ఎక్క‌డ చూసినా సెల్ఫీల పిచ్చోళ్లు. పిచ్చ పీక్ స్టేజ్ చేరింది. అవ‌స‌రంలేని అతి ప్రాణాలు తీసుకెళ్లి ..ప‌నికిరాని సెల్ఫీ ఒక‌టి మిగిల్చిపోతోంది. మార్కెట్ మాయ‌లోప‌డిన ప్ర‌పంచం స్మార్ట్‌ఫోన్‌తో చేస్తున్న సావాసం..స‌హ‌జీవ‌నం రాబోయే కాలంలో మ‌నిషిని పిచ్చోడిని చేసేంత ప్ర‌మాద‌కారిగా మార‌బోతోంద‌నేది నిపుణుల ఆందోళ‌న‌. అయితే ఇవేమీ ప‌ట్ట‌ని వేలం వెర్రి జ‌నం.. సెల్ఫీల‌తో త‌మ ప్రాణాల‌ను సెల్ఫ్‌గోల్ చేసుకుంటున్నారు. సెల్ఫీల పిచ్చ‌తో మ‌ర‌ణించ‌డం అంటే..ఇదీ […]

సెల్ఫీ పిచ్చి ప్రాణాలు తీస్తోంది
X
సెల్ఫీల‌తో సెల్ఫ్‌ గోల్
ఎవ‌రి చేతిలో చూసినా స్మార్ట్‌ఫోన్‌. ఎక్క‌డ చూసినా సెల్ఫీల పిచ్చోళ్లు. పిచ్చ పీక్ స్టేజ్ చేరింది. అవ‌స‌రంలేని అతి ప్రాణాలు తీసుకెళ్లి ..ప‌నికిరాని సెల్ఫీ ఒక‌టి మిగిల్చిపోతోంది. మార్కెట్ మాయ‌లోప‌డిన ప్ర‌పంచం స్మార్ట్‌ఫోన్‌తో చేస్తున్న సావాసం..స‌హ‌జీవ‌నం రాబోయే కాలంలో మ‌నిషిని పిచ్చోడిని చేసేంత ప్ర‌మాద‌కారిగా మార‌బోతోంద‌నేది నిపుణుల ఆందోళ‌న‌. అయితే ఇవేమీ ప‌ట్ట‌ని వేలం వెర్రి జ‌నం.. సెల్ఫీల‌తో త‌మ ప్రాణాల‌ను సెల్ఫ్‌గోల్ చేసుకుంటున్నారు. సెల్ఫీల పిచ్చ‌తో మ‌ర‌ణించ‌డం అంటే..ఇదీ ఒక ర‌క‌మైన ఆత్మ‌హ‌త్యే.
రైలింజ‌న్ పై సెల్ఫీకి ప్ర‌య‌త్నించి..
అంద‌రి కంటే వింత‌గా, అంద‌రి కంటే ముందుగా, స‌రికొత్త‌గా ఓ సెల్ఫీ దిగి ఫేస్‌బుక్ వాల్‌కెక్కిద్దామ‌నుకున్నాడు. విధి విక‌టించింది. హాస్పిట‌ల్ బెడ్డెక్కాడు. వాట్సాప్‌లో షేర్ చేద్దామ‌నుకున్న సెల్ఫీ.. చావు బ‌తుకుల మ‌ధ్య కొట్టాడుతున్నవాడిని జాలిగా చూస్తోంది. విశాఖపట్నానికి చెందిన కనుమూరి సంతోష్‌వర్మ స్నేహితులతో కలిసి ఓ వివాహానికి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌లో వచ్చాడు. స్టేష‌న్‌లో స్మార్ట్ ఫోన్ చేతిలో పెట్టుకున్న వ‌ర్మ‌లో సెల్ఫీ పిచ్చ ప‌రుగులు పెట్టించింది. స్టేష‌న్‌లో నిలిచి ఉన్న రైలు ఇంజన్‌పైకి ఎక్కి సెల్ఫీ తీసుకునే ప్ర‌య‌త్నం చేశాడు. ఇంజ‌న్ పై నున్న హైటెన్ష‌న్ విద్యుత్ తీగ‌లు త‌గిలి కింద‌ప‌డ్డాడు. హెచ్‌టీ లైను షాక్‌తో తీవ్రంగా గాయ‌ప‌డిన సంతోష్‌వ‌ర్మ ప్ర‌స్తుతం ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నాడు. సెల్పీ కోసం ప్ర‌మాదం అంచుల‌కు చేరుకున్న వ‌ర్మ‌ను స్నేహితులుగాని, స్టేష‌న్ సిబ్బందిగాని వారించే ప్ర‌య‌త్నం చేయ‌లేదు. ఇర‌వై వ‌ర్మ అర‌వై శాతం గాయాల‌తో మృత్యువుతో పోరాడుతున్నాడు.
బొమ్మ తుపాకీతో సెల్ఫీ దిగుదామ‌ని..
బొమ్మ తుపాకీతో సెల్ఫీ తీసుకోవాలని ప్రయత్నించ‌డ‌మే ఆ యువ‌కుడు చేసిన పాపం. సెల్ఫీపై మోజే ఆ కుర్రాడి పాలిట శాపమైంది. పాకిస్థాన్‌లోని ఫైసలాబాద్ నగరంలో పర్హాన్ అనే యువకుడు తన వద్ద ఉన్న బొమ్మ తుపాకీతో సెల్ఫీ దిగేందుకు ప్ర‌య‌త్నించాడు. ఇది చూసినా ఓ పోలీసు అది నిజ‌మైన తుపాకీ అని భ్ర‌మించి.. త‌న స‌హ‌చ‌ర పోలీసుల‌ను అలెర్ట్ చేశాడు. ఫ‌ర్హాన్ ఉన్న ప్రాంతానికి చేరుకున్న పోలీసులు ..అత‌ని చేతిలో ఉన్న‌ది రియ‌ల్ వెప‌న్ అనే భావించి కాల్పులు జ‌రిపారు. సెల్ఫీ దిగేందుకు తెచ్చుకున్న బొమ్మ తుపాకీతో ఫ‌ర్హాన్ ప్రాణాలొదిలాడు. అక్కడే వున్న ఫర్హాన్ స్నేహితుడు పారిపోయాడు. మృతుడి చేతిలో ఉన్న‌ది బొమ్మ తుపాకీగా నిర్ధారించుకున్న‌ పోలీసులు ఒక్క‌సారిగా అవాక్క‌య్యారు.
ఈ సెల్ఫీ ఘ‌ట‌న‌లు రెండు మూడురోజుల్లో జ‌రిగిన‌వి. ఎగురుతున్న ఒక విమానంలో సెల్ఫీ దిగేందుకు య‌త్నించిన పైలట్‌తోపాటు ప్ర‌యాణికుడు చ‌నిపోయిన ఘ‌ట‌న‌. ఆగ్రాలో వేగంగా వ‌స్తున్న రైలుకు ఎదురుగా నిల‌బ‌డి సెల్ఫీ దిగాల‌నుకున్న యువ‌కులు మృత్యువాత . ..ప్రాణాల‌తో చెల‌గాటమాడుతున్న సెల్ఫీల ఉదంతాలే.
ఒక‌ సెల్ఫీ దిగితే వ‌చ్చేదేంటి? సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేస్తే వ‌చ్చే ప్ర‌యోజ‌నం ఏంటి? మ‌హా అయితే ఓ ప‌ది లైకులు, ఓ ఐదు కామెంట్లు.. అంతే. సోష‌ల్ నెట్‌వ‌ర్కింగ్ సైట్ల‌లో తాము ప్ర‌త్యేకంగా క‌నిపించాల‌నే త‌ప‌నతో డిఫ‌రెంట్‌గా సెల్ఫీలు దిగాల‌నే ఆశ‌తో ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు.
Next Story