Telugu Global
Family

జర నవ్వండి ప్లీజ్ 124

ఒక మినిస్టర్‌ మార్నింగ్‌వాక్‌కి బయల్దేరాడు. ప్రతిపక్ష నాయకుడు ఎదురుపడ్డాడు. “అరే గాడిదతో బాటు వాకింగ్‌కి వచ్చావా?” అన్నాడు. “నీకు కళ్ళు కనిపిస్తున్నాయా? గుడ్డివాడివా? నేను వాకింగ్‌కి వచ్చింది గాడిదతో కాదు, కుక్కతో” అన్నాడు మంత్రి. “బాబూ! నేను అడిగింది నిన్ను కాదు, కుక్కని” అన్నాడు ప్రతిపక్షనేత. —————————————————————– రఘు లైబ్రరీకి వెళ్ళి ఒక పుస్తకం తీసుకుని నిశ్శబ్దంగా కూర్చుని పేజీలు తిప్పాడు. అంతలో ఒక చిన్ని కుర్రాడు కథల పుస్తకం తీసి గట్టిగా చదవడం మొదలుపెట్టాడు. ఆ […]

ఒక మినిస్టర్‌ మార్నింగ్‌వాక్‌కి బయల్దేరాడు. ప్రతిపక్ష నాయకుడు ఎదురుపడ్డాడు.
“అరే గాడిదతో బాటు వాకింగ్‌కి వచ్చావా?” అన్నాడు.
“నీకు కళ్ళు కనిపిస్తున్నాయా? గుడ్డివాడివా? నేను వాకింగ్‌కి వచ్చింది గాడిదతో కాదు, కుక్కతో” అన్నాడు మంత్రి.
“బాబూ! నేను అడిగింది నిన్ను కాదు, కుక్కని” అన్నాడు ప్రతిపక్షనేత.
—————————————————————–
రఘు లైబ్రరీకి వెళ్ళి ఒక పుస్తకం తీసుకుని నిశ్శబ్దంగా కూర్చుని పేజీలు తిప్పాడు. అంతలో ఒక చిన్ని కుర్రాడు కథల పుస్తకం తీసి గట్టిగా చదవడం మొదలుపెట్టాడు. ఆ కుర్రాణ్ణి నిశ్శబ్దంగా ఉండమని రఘు లైబ్రేరియన్‌తో చెప్పాడు.
లైబ్రేరియన్‌ కుర్రాడి దగ్గరికి వెళ్ళి “బాబూ! గట్టిగా చదవకూడదు, అందరికి డిస్ట్రబెన్స్‌గా ఉంటుంది” అన్నాడు.
ఆ కుర్రాడు లైబ్రేరియన్‌ని చూసి “వాళ్ళంతా చదవటానికి కాకుంటే ఇక్కడికెందుకు వచ్చినట్లు?” అన్నాడు.
—————————————————————–
హిమాచల్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి ఒక ఉపన్యాసంలో “సోదరసోదరీమణులారా!
మన రాష్ట్ర్రాన్ని ఇండియా స్విట్జర్లాండ్‌లా అభివృద్ధి చేస్తాం” అన్నాడు.
సభలోంచి ఒక మనిషి
“ఐతే మేము బ్లాక్‌మనీ స్విస్‌ బ్యాంకులో దాచుకోము. ఇక్కడే అకౌంట్‌ ఓపెన్‌ చేస్తాము” అన్నాడు.
—————————————————————–
ఒక అమెరికన్‌ టూరిస్టు పోలెండ్‌ వచ్చాడు. అక్కడ ఒక ఊరేగింపు ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాగుతోంది. జనం పోలీసుల మీద రాళ్లు రువ్వుతున్నారు. అమెరికన్‌ “పోలీసుల మీద రాళ్ళు రువ్వడం తప్పు, మా దేశంలో ఐతే టమేటోలు, కోడిగుడ్లు విసురుతారు” అన్నాడు. ఒక పోలెండ్‌ వ్యక్తి “మాకు టమేటోలు, కోడిగుడ్లు ఉంటే మేము ఊరేగింపులే చెయ్యం” అన్నాడు.

First Published:  24 Jun 2015 1:03 PM GMT
Next Story