Telugu Global
Others

సారూ ... మాకెప్పుడు బ‌డి ..? మూత‌బ‌డ్డ స్కూళ్లు

సారూ …   పిల్ల‌లంద‌రూ బ‌డుల‌కు  పోతున్నారు. మ‌రి మాకెప్పుడు బ‌ళ్లు తెరుస్తార‌ని ఆవేద‌నగా ప్ర‌శ్నిస్తున్నారు ముంపు మండ‌లాల విద్యార్ధులు. వేస‌వి సెల‌వులై పోయాయి. చ‌క్క‌గా స్కూలుకు వెళ్లి చ‌దువుకోవ‌చ్చ‌ని సంబ‌ర‌ప‌డ్డ ఆ విద్యార్ధుల‌కు నిరాశే మిగిలింది. ముంపు మండ‌లాలకు చెందిన 400 మంది  టీచ‌ర్లు పాఠ‌శాల‌ల‌ను వ‌దిలి  తెలంగాణ‌కు వెళ్లి పోవ‌డంతో  అక్క‌డ‌  స్కూళ్లు నిర‌వ‌ధికంగా మూత ప‌డ్డాయి. రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత తెలంగాణ నుంచి ఏపీలో విలీన‌మైన ఖమ్మం జిల్లాకు చెందిన ఏడు మండ‌లాల్లోని ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లు […]

సారూ … పిల్ల‌లంద‌రూ బ‌డుల‌కు పోతున్నారు. మ‌రి మాకెప్పుడు బ‌ళ్లు తెరుస్తార‌ని ఆవేద‌నగా ప్ర‌శ్నిస్తున్నారు ముంపు మండ‌లాల విద్యార్ధులు. వేస‌వి సెల‌వులై పోయాయి. చ‌క్క‌గా స్కూలుకు వెళ్లి చ‌దువుకోవ‌చ్చ‌ని సంబ‌ర‌ప‌డ్డ ఆ విద్యార్ధుల‌కు నిరాశే మిగిలింది. ముంపు మండ‌లాలకు చెందిన 400 మంది టీచ‌ర్లు పాఠ‌శాల‌ల‌ను వ‌దిలి తెలంగాణ‌కు వెళ్లి పోవ‌డంతో అక్క‌డ‌ స్కూళ్లు నిర‌వ‌ధికంగా మూత ప‌డ్డాయి. రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత తెలంగాణ నుంచి ఏపీలో విలీన‌మైన ఖమ్మం జిల్లాకు చెందిన ఏడు మండ‌లాల్లోని ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లు మూత ప‌డ్డాయి. ఇక్క‌డి టీచ‌ర్లు తెలంగాణ‌లో ప‌ని చేస్తామ‌ని వెళ్లి పోవ‌డంతో ఈ ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఏడు మండ‌ల్లాలోని టీచ‌ర్ల‌ను తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ‌లోకి తీసుకోవాల‌ని ఆ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేయ‌డంతో త‌మ‌ను రిలీవ్ చేయ‌మ‌ని అక్క‌డి టీచ‌ర్లు కొంత‌కాలంగా ఏపీ ప్ర‌భుత్వాన్ని కోరుతూ వ‌చ్చారు. ఈ విద్యా సంవ‌త్సరానికి ముందే తెలంగాణ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు ఇచ్చినా, ఏపీ ప్ర‌భుత్వం ఎలాంటి ప్ర‌త్యామ్నాయ ఏర్పాట్లు చేయ‌లేదు. విద్యా సంవ‌త్స‌రం ప్రారంభ‌మ‌య్యాక ముంపు మండ‌లాల‌ టీచ‌ర్ల‌ను రిలీవ్ చేయ‌మ‌ని ఖ‌మ్మం క‌లెక్ట‌ర్ ఈ మండలాల విద్యాధికారుల‌ను ఆదేశించారు. ఎంఈఓలు ఈ స‌మ‌స్య‌ను ఉన్న‌తాధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫ‌లితం లేక‌పోవ‌డంతో టీచ‌ర్లే స్వ‌చ్చందంగా రిలీవ్ లేఖ‌లు రాసి ఇచ్చి స్కూళ్ల నుంచి వెళ్లి పోయారు. ఏడు మండ‌లాల‌కు చెందిన 400 మంది ఉపాధ్యాయులు తెలంగాణ‌కు వెళ్లిపోవ‌డంతో అక్క‌డి స్కూళ్ల‌న్నీ మూత‌బ‌డ్డాయి. దీంతో ఆ పాఠ‌శాల‌ల విద్యార్ధుల ప‌రిస్థితి అగ‌మ్య‌గోచ‌రంగా మారింది. సారెప్పుడు వ‌స్తారు? బ‌ళ్లు ఎప్పుడు తెరుస్తార‌ని ఆశ‌గా ఎదురు చూస్తున్నారు.

First Published:  24 Jun 2015 1:15 PM GMT
Next Story