Telugu Global
Cinema & Entertainment

రుద్రమదేవి కూడా దూసుకొస్తోంది 

బాహుబలి సినిమా ఫస్ట్ కాపీ సిద్ధమై సెన్సార్ పూర్తిచేసుకుంటే.. రుద్రమదేవి కూడా ఏమాత్రం తగ్గకుండా శరవేగంగా దూసుకొస్తోంది. తాజాగా ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తిచేసుకుంది. సినిమాకు సంబంధించి గ్రాఫిక్ వర్క్ మొత్తం కంప్లీట్ అయింది. ఈ నెలాఖరుకు ఫస్ట్ కాపీ సిద్ధం చేయాలని భావిస్తున్నారు. ఇండియాలోనే మొట్టమొదటి హిస్టారికల్ మూవీగా తెరకెక్కిస్తున్నారు రుద్రమదేవి సినిమాను. ఫస్ట్ కాపీ సిద్ధమైపోగానే ప్రమోషన్ ను పెద్దఎత్తున చేయాలని నిర్ణయించాడు గుణశేఖర్. ఇప్పటికే అనుష్క, రానాతో పాటు అల్లు […]

రుద్రమదేవి కూడా దూసుకొస్తోంది 
X
బాహుబలి సినిమా ఫస్ట్ కాపీ సిద్ధమై సెన్సార్ పూర్తిచేసుకుంటే.. రుద్రమదేవి కూడా ఏమాత్రం తగ్గకుండా శరవేగంగా దూసుకొస్తోంది. తాజాగా ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తిచేసుకుంది. సినిమాకు సంబంధించి గ్రాఫిక్ వర్క్ మొత్తం కంప్లీట్ అయింది. ఈ నెలాఖరుకు ఫస్ట్ కాపీ సిద్ధం చేయాలని భావిస్తున్నారు. ఇండియాలోనే మొట్టమొదటి హిస్టారికల్ మూవీగా తెరకెక్కిస్తున్నారు రుద్రమదేవి సినిమాను. ఫస్ట్ కాపీ సిద్ధమైపోగానే ప్రమోషన్ ను పెద్దఎత్తున చేయాలని నిర్ణయించాడు గుణశేఖర్. ఇప్పటికే అనుష్క, రానాతో పాటు అల్లు అర్జున్ ను కూడా సంప్రదించాడు. ట్రయిలర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో.. త్వరలోనే కొన్ని యుద్ధసన్నివేశాలతో పాటు సాంగ్ బిట్స్ ను విడుదల చేయాలనుకుంటున్నాడు గుణశేఖర్. ఆ తర్వాత సినిమా యూనిట్ తో కలిసి భారీగా ప్రచారం చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమాకు కొన్ని రోజులు ప్రచారం కల్పించేందుకు అల్లు అర్జున్ ఒప్పుకున్నట్టు సమాచారం. అటు అనుష్క, రానా కూడా బాహుబలి హడావుడి ముగిసినవెంటనే, రుద్రమదేవి ప్రచారానికి సిద్ధమౌతున్నారు.
First Published:  23 Jun 2015 11:54 PM GMT
Next Story