Telugu Global
CRIME

గుడికి వ‌ద్ద‌న్నందుకు అత్తను చంపిన కోడ‌లు

భ‌ర్త ఇంట్లో లేని స‌మ‌యంలో గుడికి వెళ్లొద్దు. అత‌ను వ‌చ్చిన త‌ర్వాత వెళుదువులే అని మంద‌లించిన పాపానికి అత్త‌ను దారుణంగా చంపేసిందో కోడ‌లు. అంతే కాకుండా హ‌త్యా నెపాన్ని దొంగ‌ల‌పై వేయాల‌న్న ఉద్దేశ్యంతో ఇంట్లోని 16 తులాల బంగారం కూడా పోయింద‌ని అబ‌ద్దాలాడింది. ఈ దారుణ‌మైన సంఘ‌ట‌న‌ హైద‌రాబాద్ లోని రామంతాపూర్ లో చోటు చేసుకుంది. ఉప్ప‌ల్ పోలీసులు  ఈ హత్య కేసును చేధించ‌డంతో కోడ‌లి బండారం బైట ప‌డింది. రామంతాపూర్ లోని న్యూగోఖ‌లే న‌గ‌ర్ కు […]

గుడికి వ‌ద్ద‌న్నందుకు అత్తను చంపిన కోడ‌లు
X

భ‌ర్త ఇంట్లో లేని స‌మ‌యంలో గుడికి వెళ్లొద్దు. అత‌ను వ‌చ్చిన త‌ర్వాత వెళుదువులే అని మంద‌లించిన పాపానికి అత్త‌ను దారుణంగా చంపేసిందో కోడ‌లు. అంతే కాకుండా హ‌త్యా నెపాన్ని దొంగ‌ల‌పై వేయాల‌న్న ఉద్దేశ్యంతో ఇంట్లోని 16 తులాల బంగారం కూడా పోయింద‌ని అబ‌ద్దాలాడింది. ఈ దారుణ‌మైన సంఘ‌ట‌న‌ హైద‌రాబాద్ లోని రామంతాపూర్ లో చోటు చేసుకుంది. ఉప్ప‌ల్ పోలీసులు ఈ హత్య కేసును చేధించ‌డంతో కోడ‌లి బండారం బైట ప‌డింది. రామంతాపూర్ లోని న్యూగోఖ‌లే న‌గ‌ర్ కు చెందిన దొర‌శెట్టి చంద్ర‌శేఖ‌ర్ తల్లి వీర‌మ‌ణి (80) ఈనెల 9న హ‌త్య‌కు గురైంది. అదే స‌మ‌యంలో ఇంట్లో ఉన్న 16 తులాల బంగారం కూడా అప‌హ‌ర‌ణ‌కు గురైంది. చంద్ర‌శేఖ‌ర్ భార్య భార్గ‌వి స్కూలుకు వెళ్లిన స‌మ‌యంలో వీర‌మ‌ణి హ‌త్య, బంగారం చోరీ జ‌రిగిన‌ట్లు భార్గ‌వి ఉప్ప‌ల్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు కేసు చేధించ‌డంతో అస‌లు హంత‌కురాలు కోడ‌లు భార్గ‌వి అనే విష‌యం తెలిసింది.అత్త వీర‌మ‌ణిని స్నానం చేయించేందుకు భార్గ‌వి ఆమెను బాత్‌రూంకు తీసుకు వెళ్లింది. వీర‌మ‌ణి స్నానం చేస్తున్న స‌మ‌యంలోనే తాను గుడికి వెళ్లి వ‌స్తాన‌ని చెప్పింది. కొడుకు లేని స‌మ‌యంలో గుడికి ఎందుక‌ని వీర‌మ‌ణి కోడ‌లితో అన్నారు. ఆ మాట‌లు న‌చ్చ‌ని భార్గ‌వి కోపంతో అత్త వీర‌మ‌ణి త‌ల‌ను నీటి ట్యాప్ కేసి ప‌లుమార్లు కొట్టింది. దీంతో తీవ్రంగా గాయ‌ప‌డిన అత్త అక్క‌డిక‌క్క‌డే మృతి చెందింది. హ‌త్యానెపం దుండుగుల‌పై వేయాల‌న్న ఆలోచ‌న‌తో భార్గ‌వి ఇంట్లోని 16 తులాల బంగారాన్ని వేరే చోట దాచి, ఇంట్లో వ‌స్తువుల‌ను చింద‌ర‌వంద‌ర‌గా ప‌డేసి స్కూలుకు వెళ్లింది. స్కూలు నుంచి ఇంటికి వ‌చ్చి దొంగ‌లు ప‌డ్డార‌ని, బంగారం చోరీ చేసి త‌న అత్త‌ను కూడా హ‌త్య చేశార‌ని చుట్టుప‌క్క‌ల వారిని న‌మ్మించింది. పోలీసులు విచార‌ణ చేయ‌డంతో అస‌లు విష‌యం బైట ప‌డింది. పోలీసులు భార్గ‌విని అరెస్ట్ చేసి రిమాండ్‌కు త‌ర‌లించారు.

Next Story