Telugu Global
CRIME

ఫేస్‌బుక్ ప‌రిచ‌యం... రూ. 18 ల‌క్ష‌లు హాంఫ‌ట్‌

పేస్‌బుక్ ద్వారా ప‌రిచ‌యం అయిన ఓ నైజీరియ‌న్‌కు రూ. 18 ల‌క్ష‌లు స‌మ‌ర్పించుకుందో టీచ‌ర‌మ్మ. మొన్న మార్చిలోనే ఇత‌ను ఈ టీచ‌ర‌మ్మ‌కు ప‌రిచ‌య‌మ‌య్యాడు. రెండు నెల‌లు మామూలుగా మాట్టాడుకున్నారు. ఆ త‌ర్వాత మాట‌లు కాస్త నెమ్మ‌దిగా ప్రేమ‌లోకి దింపాయి. నువ్వు లేకుండా నేను బ‌త‌క‌లేన‌న్నాడు… నువ్వు లేక‌పోతే నేనూ బ‌త‌క‌లేనంది. ఇద్ద‌రూ కూడా ఒక‌రి కోసం ఒక‌రు బ‌తుకుదామనుకున్నారు. తన పేరు కెల్విన్‌ వైనీ అని… యూకేలో జియాలిస్ట్‌నని చెప్పాడు. పెళ్లిచేసుకుంటానన్నాడు. భారత్‌కు వచ్చి తన తండ్రితో […]

ఫేస్‌బుక్ ప‌రిచ‌యం... రూ. 18 ల‌క్ష‌లు హాంఫ‌ట్‌
X
పేస్‌బుక్ ద్వారా ప‌రిచ‌యం అయిన ఓ నైజీరియ‌న్‌కు రూ. 18 ల‌క్ష‌లు స‌మ‌ర్పించుకుందో టీచ‌ర‌మ్మ. మొన్న మార్చిలోనే ఇత‌ను ఈ టీచ‌ర‌మ్మ‌కు ప‌రిచ‌య‌మ‌య్యాడు. రెండు నెల‌లు మామూలుగా మాట్టాడుకున్నారు. ఆ త‌ర్వాత మాట‌లు కాస్త నెమ్మ‌దిగా ప్రేమ‌లోకి దింపాయి. నువ్వు లేకుండా నేను బ‌త‌క‌లేన‌న్నాడు… నువ్వు లేక‌పోతే నేనూ బ‌త‌క‌లేనంది. ఇద్ద‌రూ కూడా ఒక‌రి కోసం ఒక‌రు బ‌తుకుదామనుకున్నారు. తన పేరు కెల్విన్‌ వైనీ అని… యూకేలో జియాలిస్ట్‌నని చెప్పాడు. పెళ్లిచేసుకుంటానన్నాడు. భారత్‌కు వచ్చి తన తండ్రితో మాట్లాడమని ఉపాధ్యాయురాలు చెప్పింది. మరో రెండు నెలల్లో ఇండియాకు వస్తున్నానని.. 1.4 లక్షల జీబీ పౌండ్స్‌తోపాటు ల్యాప్‌టాప్‌, ఇతర వస్తువుల పార్సిల్‌ పంపిస్తున్నాన‌ని చెప్పాడు. ఇది జరిగిన నాలుగు రోజులకు ముంబయ్‌కి చెందిన స్కైబర్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ కొరియర్‌ సర్వీస్‌ నుంచి మాట్లాడుతున్నానంటూ ఓ వ్యక్తి ఫోన్‌ చేసి నైజీరియా నుంచి వ‌చ్చిన పార్సిల్‌ను కస్టమ్స్ అధికారులు సీజ్‌ చేశారని ఈ ఉపాధ్యాయురాలికి సమాచారం ఇచ్చాడు. అనంతరం ఇద్దరు వ్యక్తులు కస్టమ్స్‌ అధికారులమని చెప్పి పార్సిల్‌ అందాలంటే డబ్బులు కట్టాలన్నారు. ఐసీఐసీఐ బ్యాంకు ద్వారా ఐదు దఫాలుగా ఆమె వద్ద నుంచి 18.11 లక్షలు వసూలు చేశారు. అంతటితో ఆగకుండా ఇంకా కావాలని అడగడంతో ఆమెకు అనుమానం వచ్చి సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు ముంబయ్‌ వెళ్లి అనిజాన్ ఇబుచి అనే ఈ దొంగ కెల్విన్‌తోపాటు అతడి సహాయకుడు బిల్లాల్‌ఖాన్‌ అహ్మద్ దేశ్‌ముఖ్‌ను అరెస్టు చేశారు. బిల్లాల్‌ఖాన్‌ పరిచయస్థుల నుంచి ఏటీఎం సమాచారం తీసుకొని ఇబుచికి అందచేస్తుండేవాడు. ఏటీఎం నుంచి డ్రాచేసిన డబ్బులో పదిశాతం కమీషన్‌ బిల్లాల్‌ తీసుకునేవాడని పోలీసులు తెలిపారు. 18.11 లక్షలకు కుచ్చుటోపి పెట్టిన నైజీరియన్‌ను అతడి సహాయకుడిని సైబర్‌ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. గచ్చిబౌలిలోని ఓ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో టీచ‌ర్‌గా పనిచేస్తోంది ఈ మోస‌పోయిన యువ‌తి.
First Published:  23 Jun 2015 6:44 AM GMT
Next Story