Telugu Global
CRIME

ట్రాఫిక్‌ హెడ్‌ కానిస్టేబుల్‌పై దాడి

అన్యాయంగా కేసులు రాస్తున్నారంటూ ఓ ట్రాఫిక్‌ హెడ్ కానిస్టేబుల్‌పై కొందరు వ్యక్తులు దాడికి దిగారు. తగరపువలస పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌లో విధులు నిర్వహిస్తున్న అప్పల్రాజు అనే హెడ్‌కానిస్టేబుల్‌, ట్రాఫిక్‌ ఎస్సై భాస్కర్‌రావు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ నిర్వహించి రవి అనే యువకుడిపై కేసు నమోదు చేశారు. బాగా తాగి ఉన్న ర‌వి బ్రీత్ ఎన‌లైజ‌ర్ టెస్ట్‌కు నిరాక‌రించాడు. అత‌నితో బ‌ల‌వంతంగా టెస్ట్ నిర్వ‌హించి తాగి ఉన్న‌ట్టు క‌నుగొన్నారు. దీంతో అత‌నిపై పోలీసులు కేసు పెట్టారు.  దీన్ని త‌ట్టుకోలేక‌పోయిన […]

అన్యాయంగా కేసులు రాస్తున్నారంటూ ఓ ట్రాఫిక్‌ హెడ్ కానిస్టేబుల్‌పై కొందరు వ్యక్తులు దాడికి దిగారు. తగరపువలస పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌లో విధులు నిర్వహిస్తున్న అప్పల్రాజు అనే హెడ్‌కానిస్టేబుల్‌, ట్రాఫిక్‌ ఎస్సై భాస్కర్‌రావు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ నిర్వహించి రవి అనే యువకుడిపై కేసు నమోదు చేశారు. బాగా తాగి ఉన్న ర‌వి బ్రీత్ ఎన‌లైజ‌ర్ టెస్ట్‌కు నిరాక‌రించాడు. అత‌నితో బ‌ల‌వంతంగా టెస్ట్ నిర్వ‌హించి తాగి ఉన్న‌ట్టు క‌నుగొన్నారు. దీంతో అత‌నిపై పోలీసులు కేసు పెట్టారు. దీన్ని త‌ట్టుకోలేక‌పోయిన ర‌వి త‌న‌పై అన్యాయంగా కేసు పెట్టారంటూ అప్పల్రాజుపై తిరగబడ్డాడు. ఈ క‌థ అంత‌టితో ఆగిపోలేదు. విష‌యాన్ని కుటుంబ స‌భ్యుల‌కు చేర‌వేశాడు రవి. అంతే ఇత‌ని కుటుంబసభ్యులు ఏకంగా పోలీస్‌స్టేషన్‌కు వచ్చి అప్పల్రాజుపై చెప్పులతో దాడి చేశారు. ఐదారు దెబ్బ‌లు కూడా కానిస్టేబుళ్ళ‌కు త‌గిలాయి. పోలీస్ స్టేష‌న్ అంతా భీతావాహంగా త‌యారైంది. ఈనేప‌థ్యంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. త‌మ కుటుంబంపై క‌క్ష‌తోనే అప్ప‌ల్రాజు కేసులు పెడుతున్నాడంటూ ర‌వి కుటుంబ‌స‌భ్య‌లు ఆరోపించారు. మ‌రి కేసు… కానిస్టేబుల్‌పై దాడి వెనుక ఉన్న కథేంటో తేలాల్సి ఉంది. త‌మ పోలీసుల‌ను కొట్టార‌ని తెలుసుకున్న మిగ‌తా స‌భ్యులు సంఘ‌ట‌న స్థ‌లికి వెళ్ళారు. కేసు ద‌ర్యాప్తు చేస్తున్నారు.
First Published:  22 Jun 2015 8:01 PM GMT
Next Story