Telugu Global
Others

జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు గవర్నర్‌ పిలుపు

జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ సోమేష్‌కుమార్‌కు గవర్నర్‌ నరసింహన్ నుంచి పిలుపు వచ్చింది. సాయంత్రం 4 గంటలకు తనను క‌ల‌వ వ‌ల‌సిందిగా సోమేష్‌కుమార్‌ను గవర్నర్ ఆదేశించినట్లు తెలిసింది. త్వరలో జరగనున్న గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలతో పాటు ఉమ్మడి రాజధానికి సంబంధించిన పలు అంశాలపై ఆయనతో చర్చించనున్నట్లు సమాచారం. ఈ అంశానికి సంబంధించి ఇప్ప‌టికే గ్రేట‌ర్ కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు దానం నాగేంద‌ర్ నేతృత్వంలో గ‌వ‌ర్న‌ర్‌ను క‌లిసి జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ సోమేష్‌కుమార్‌పై ప‌లు ఆరోప‌ణ‌లు చేశారు. ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకుని ఓట‌ర్ల […]

జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ సోమేష్‌కుమార్‌కు గవర్నర్‌ నరసింహన్ నుంచి పిలుపు వచ్చింది. సాయంత్రం 4 గంటలకు తనను క‌ల‌వ వ‌ల‌సిందిగా సోమేష్‌కుమార్‌ను గవర్నర్ ఆదేశించినట్లు తెలిసింది. త్వరలో జరగనున్న గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలతో పాటు ఉమ్మడి రాజధానికి సంబంధించిన పలు అంశాలపై ఆయనతో చర్చించనున్నట్లు సమాచారం. ఈ అంశానికి సంబంధించి ఇప్ప‌టికే గ్రేట‌ర్ కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు దానం నాగేంద‌ర్ నేతృత్వంలో గ‌వ‌ర్న‌ర్‌ను క‌లిసి జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ సోమేష్‌కుమార్‌పై ప‌లు ఆరోప‌ణ‌లు చేశారు. ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకుని ఓట‌ర్ల స‌వ‌ర‌ణ పేరుతో చాలా మంది పేర్లు తొల‌గించార‌ని, వీరిలో ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఓట‌ర్లు ఉన్నార‌ని, కావాల‌నే వీరిని తొల‌గించార‌ని వారు ఫిర్యాదు చేశారు. న‌గ‌ర కార్పొరేష‌న్‌కు జ‌రిగే ఎన్నిక‌ల్లో త‌మ‌కు అనుకూలంగా ఉండ‌ర‌న్న ఉద్దేశ్యంతోనే టీఆర్ఎస్ వీరి పేర్లు తొల‌గించాల‌ని సూచిస్తే దానికి ఆయ‌న వంత పాడార‌ని ఆరోపించారు. ఇది కాకుండా వార్డుల విభ‌జ‌న‌లో టీఆర్ఎస్‌కు మేలు జ‌రిగేలా సోమేష్‌కుమార్ వ్య‌వ‌హ‌రించార‌ని కూడా ఆరోపించారు. ఈ అంశాల‌న్నీ ఈ భేటీలో చ‌ర్చ‌కు రావ‌చ్చ‌ని అనుకుంటున్నారు.
First Published:  22 Jun 2015 1:20 PM GMT
Next Story