Telugu Global
NEWS

ఆ టేప్‌లు క‌ట్‌, పేస్టులు కావు!

ఓటుకు నోటు ఎర కేసులో ఏపీ సీఎం చంద్ర‌బాబుకు ఉచ్చు బిగుసుకుంటోంది. ఈ కేసులో ఎంతో కీల‌కంగా భావిస్తున్న ఆడియో టేపుల్లో ఉన్న‌ది బాబు గొంతేన‌ని ఫోరెన్సిక్ అధికారులు ప్రాథ‌మిక‌ నిర్ధార‌ణ‌కు వ‌చ్చిన‌ట్లు తాజాగా ‘న‌మ‌స్తే తెలంగాణ’ ప్ర‌చురించిన క‌థ‌నం సంచ‌ల‌నం రేపుతోంది.  ఆడియోలో ఉన్న గొంతు బాబుదేన‌ని, ఎక్క‌డా ‘క‌ట్ అండ్ పేస్టు’లు లేవ‌ని నిర్ధార‌ణ‌కు వ‌చ్చిన‌ట్లు క‌థ‌నంలో పేర్కొన్నారు. మొద‌టి నుంచి ఈ కేసులో ఎక్స్‌క్లూజివ్ ఆడియో, వీడియోలు, నివేదిక‌లు, వాంగ్మూలాలు సంపాదిస్తున్న న‌మ‌స్తే […]

ఆ టేప్‌లు క‌ట్‌, పేస్టులు కావు!
X

ఓటుకు నోటు ఎర కేసులో ఏపీ సీఎం చంద్ర‌బాబుకు ఉచ్చు బిగుసుకుంటోంది. ఈ కేసులో ఎంతో కీల‌కంగా భావిస్తున్న ఆడియో టేపుల్లో ఉన్న‌ది బాబు గొంతేన‌ని ఫోరెన్సిక్ అధికారులు ప్రాథ‌మిక‌ నిర్ధార‌ణ‌కు వ‌చ్చిన‌ట్లు తాజాగా ‘న‌మ‌స్తే తెలంగాణ’ ప్ర‌చురించిన క‌థ‌నం సంచ‌ల‌నం రేపుతోంది. ఆడియోలో ఉన్న గొంతు బాబుదేన‌ని, ఎక్క‌డా ‘క‌ట్ అండ్ పేస్టు’లు లేవ‌ని నిర్ధార‌ణ‌కు వ‌చ్చిన‌ట్లు క‌థ‌నంలో పేర్కొన్నారు. మొద‌టి నుంచి ఈ కేసులో ఎక్స్‌క్లూజివ్ ఆడియో, వీడియోలు, నివేదిక‌లు, వాంగ్మూలాలు సంపాదిస్తున్న న‌మ‌స్తే తెలంగాణ తాజా క‌థ‌నంతో టీడీపీ నేత‌లు ఉలిక్కి ప‌డుతున్నారు. గొంతు నిర్ధార‌ణ ప‌రీక్ష‌ల‌కు చంద్ర‌బాబు హాజ‌రుకాక‌పోతే.. అసెంబ్లీలో ఆయ‌న మాట్లాడిన రికార్డుల‌ను తీసుకునే అవ‌కాశాలు ఉన్నాయి. ఈ కేసులో ఇప్ప‌టికే ఏపీ స‌ర్కారు విద్వేషాలు రెచ్చ‌గొట్టారంటూ ‘టీ-న్యూస్‌’చాన‌ల్‌కే నోటీసులు ఇచ్చిన నేప‌థ్యంలో తాజా క‌థ‌నం సంచ‌ల‌నం సృష్టిస్తోంది. ‘ఢీ అంటే ఢీ ‘ అన్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తున్న ఏపీ స‌ర్కారు క‌థ‌నానికి దీటుగా ఎలా ముంద‌డుగు వేయ‌నుంద‌న్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.

First Published:  22 Jun 2015 1:33 AM GMT
Next Story