Telugu Global
Cinema & Entertainment

బాహుబ‌లి  గురించి ప్ర‌భాస్ ఆందోళ‌న‌..? 

ఎవ‌రో  కొత్త ద‌ర్శ‌కుడు బాహుబ‌లి సినిమాను  డైరెక్ట్ చేసి వుంటే  ఇంత హంగామ ఉండేది కాదు.  ద‌ర్శ‌క జ‌క్క‌న్న చేయ‌డంతో   బాహుబ‌లి  కి సంబంధించిన ప్ర‌తీది పెద్ద న్యూస్ అవుతుంది. తాజాగా  ప్ర‌భాస్ కు సంబంధించిన మ‌రో వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఈచిత్రం కోసం  ప్ర‌భాస్ త‌న దేహాం ప‌లు ర‌కాలు గా మార్చుకోవాల్సి వ‌చ్చింది.అమ‌రేంద్ర బాహుబ‌లి.. శివుడు అనే రెండు రోల్స్ ప్ర‌భాస్   ఈ చిత్రంలో పోషించారు. శివుడి పాత్ర వ‌చ్చే స‌రికి […]

బాహుబ‌లి  గురించి ప్ర‌భాస్ ఆందోళ‌న‌..? 
X
ఎవ‌రో కొత్త ద‌ర్శ‌కుడు బాహుబ‌లి సినిమాను డైరెక్ట్ చేసి వుంటే ఇంత హంగామ ఉండేది కాదు. ద‌ర్శ‌క జ‌క్క‌న్న చేయ‌డంతో బాహుబ‌లి కి సంబంధించిన ప్ర‌తీది పెద్ద న్యూస్ అవుతుంది. తాజాగా ప్ర‌భాస్ కు సంబంధించిన మ‌రో వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఈచిత్రం కోసం ప్ర‌భాస్ త‌న దేహాం ప‌లు ర‌కాలు గా మార్చుకోవాల్సి వ‌చ్చింది.అమ‌రేంద్ర బాహుబ‌లి.. శివుడు అనే రెండు రోల్స్ ప్ర‌భాస్ ఈ చిత్రంలో పోషించారు. శివుడి పాత్ర వ‌చ్చే స‌రికి స‌న్న‌గా క‌నిపించాల్సి వ‌చ్చింద‌ట‌. దీని కోసం 30 నుంచి 40 రోజ‌లు పాటు కేవ‌లం రోజుకు కొన్ని ఉడ‌క బెట్టిన గుడ్లు మాత్ర‌మే తినాల్సి వ‌చ్చింద‌ట‌. నిజంగానే శివ‌లింగాన్ని ఎత్తుకుని వెళ్తున్న ప్ర‌భాస్ రూపం ఎంత అందంగా ఉందో చెప్ప‌డం క‌ష్ట‌మే. నిజం చెప్పుకుంటే సినిమాకు సంబంధించి ఎంత‌గా క‌ష్ట ప‌డ్డారో .. ఆక‌ష్టాన్ని అంతా తెర‌మీద చూసుకుని మ‌ర‌చిపోతారంటున్నారు. జూలై 10 న ప్ర‌పంచ వ్యాప్తంగా బాహుబ‌లి చిత్రం విడుద‌ల అవుతున్న విష‌యం తెలిసిందే. ప్ర‌భాస్ ద్విపాత్రాభిన‌యం. రానా ప్ర‌తి నాయ‌కుడు .. ర‌మ్య‌కృష్ణ‌, స‌త్య‌రాజ్, నాజ‌ర్, సుదీప్ , ప్ర‌భాక‌ర్, కీ రోల్స్ చేశారు. ఇక బాహుబ‌లి విడుద‌లైన త‌రువాత అభిమానుల్ని ఏ రేంజ్ లో మెప్పిస్తుందో అని ఆందోళ‌న ప‌డుతున్నారు హీరో ప్ర‌భాస్. సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌రు తుఫాను సృష్టించ‌డం ఖాయ‌మంటున్నారు చిత్ర యూనిట్.
First Published:  21 Jun 2015 12:17 AM GMT
Next Story