Telugu Global
Others

రైల్ టికెట్ రిజ‌ర్వేష‌న్‌లో ఓ ఆప్ష‌న్‌

ఇక రైల్వే టికెట్లు క‌న్‌ఫం కోసం పెద్ద‌గా ఎదురు చూడాల్సిన అవ‌స‌రం ఉండ‌దంటున్నాయి రైల్వే వ‌ర్గాలు. విప‌రీత‌మైన ర‌ద్దీ ఉన్న స‌మ‌యంలో వేసే సువిధ ఎక్స్‌ప్రెస్ రైళ్ళ‌కు దాదాపు క‌న్‌ఫం అయిన టికెట్ల‌నే విక్ర‌యిస్తారు. ఇందులో మ‌రొక వెసులు బాటు కూడా పెడుతున్నారు. టికెట్ రిజ‌ర్వు చేసుకునే స‌మ‌యంలోనే మీ టికెట్ అప్‌గ్రేడ్ చేసుకోవ‌డానికిగాని, డీగ్రేడ్ చేసుకోవ‌డానికిగాని ఆప్ష‌న్ అడుగుతారు. ఈ విష‌యం మీరు టికెట్‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే స‌మ‌యంలోనే న‌మోదు చేయాల్సి ఉంటుంది. మీ అప్ష‌న్‌ను […]

ఇక రైల్వే టికెట్లు క‌న్‌ఫం కోసం పెద్ద‌గా ఎదురు చూడాల్సిన అవ‌స‌రం ఉండ‌దంటున్నాయి రైల్వే వ‌ర్గాలు. విప‌రీత‌మైన ర‌ద్దీ ఉన్న స‌మ‌యంలో వేసే సువిధ ఎక్స్‌ప్రెస్ రైళ్ళ‌కు దాదాపు క‌న్‌ఫం అయిన టికెట్ల‌నే విక్ర‌యిస్తారు. ఇందులో మ‌రొక వెసులు బాటు కూడా పెడుతున్నారు. టికెట్ రిజ‌ర్వు చేసుకునే స‌మ‌యంలోనే మీ టికెట్ అప్‌గ్రేడ్ చేసుకోవ‌డానికిగాని, డీగ్రేడ్ చేసుకోవ‌డానికిగాని ఆప్ష‌న్ అడుగుతారు. ఈ విష‌యం మీరు టికెట్‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే స‌మ‌యంలోనే న‌మోదు చేయాల్సి ఉంటుంది. మీ అప్ష‌న్‌ను బ‌ట్టి మీ టికెట్‌ను ఆప్‌గ్రేడ్ చేయ‌డంగాని, డీగ్రేడ్ చేయ‌డం కాని చేస్తారు. అంటే మీరు ఏసీలో రిజ‌ర్వ్ చేసుకుని వెయిటింగ్ లిస్ట్‌లో ఉండి క‌న్‌ఫం కాక‌పోతే అందుబాటులో ఉండే కింది త‌ర‌గ‌తి (డిగ్రేడ్ చేసి) టికెట్ క‌న్‌ఫం చేస్తారు. అలాగే సెకండ్ ఏసీలో అవ‌కాశం లేక‌పోతే అప్‌గ్రేడ్‌లో రిజ‌ర్వు చేస్తారు. అంటే ఏసీకి రిజ‌ర్వు చేస్తారు. అయితే ఈ ఆప్ష‌న్ మీరు ద‌ర‌ఖాస్తులో పొందుప‌ర‌చ‌వ‌ల‌సి ఉంటుంది.
First Published:  20 Jun 2015 1:07 PM GMT
Next Story