Telugu Global
Others

లాడెన్ డెత్ సర్టిఫికెట్ కోసం కుమారుడి రిక్వెస్ట్‌

ఉగ్రవాద సంస్థ అల్‌ఖైదా అధినేత ఒసామా బిన్ లాడెన్ మరణ ధ్రువీకరణ పత్రం కోసం అమెరికా ప్రభుత్వానికి అతని కుమారుడు అబ్దుల్లా బిన్ లాడెన్‌ ఓ లేఖ రాశాడని వికీలీక్స్ వెల్లడించింది. అమెరికా నేవీ సీల్స్ 2011, మే 2వ తేదీన పాకిస్థాన్‌లోని అబోటాబాద్‌లో ఉన్న లాడెన్‌ ఇంటిపై దాడి చేసి అతణ్ని అంతమొందించింది అమెరికాయే కాబట్టి ఆ దేశానికి కుమారుడు అర్జీ పెట్టుకున్నాడు. ఈ హత్య జరిగిన రెండు నెలలకు తన తండ్రి డెత్ సర్టిఫికెట్ […]

ఉగ్రవాద సంస్థ అల్‌ఖైదా అధినేత ఒసామా బిన్ లాడెన్ మరణ ధ్రువీకరణ పత్రం కోసం అమెరికా ప్రభుత్వానికి అతని కుమారుడు అబ్దుల్లా బిన్ లాడెన్‌ ఓ లేఖ రాశాడని వికీలీక్స్ వెల్లడించింది. అమెరికా నేవీ సీల్స్ 2011, మే 2వ తేదీన పాకిస్థాన్‌లోని అబోటాబాద్‌లో ఉన్న లాడెన్‌ ఇంటిపై దాడి చేసి అతణ్ని అంతమొందించింది అమెరికాయే కాబట్టి ఆ దేశానికి కుమారుడు అర్జీ పెట్టుకున్నాడు. ఈ హత్య జరిగిన రెండు నెలలకు తన తండ్రి డెత్ సర్టిఫికెట్ గురించి అబ్దుల్లా అమెరికా ప్రభుత్వానికి లేఖ రాశాడు. ఈ లేఖను అందుకున్న యూఎస్ కౌన్సిల్ జనరల్ గ్లెన్ కీసర్.. అబ్దుల్లాకు జవాబు రాశారు. ‘అబ్దుల్లా.. మీ తండ్రి డెత్ సర్టిఫికెట్ గురించి రాసిన లేఖ నాకు అందింది. అమెరికా మిలిటరీ అపరేషన్స్‌లో మరణించిన వారి డెత్ సర్టిఫికెట్లను ఇవ్వడం కుదరదు. మీకు అంతగా కావాలంటే అమెరికా ప్రభుత్వ డాక్యుమెంట్లను, కోర్టు పత్రాలను మీకు పంపిస్తామ’ని ఆ లేఖలో ఆయన పేర్కొన్నట్లు వికీలీక్స్ తెలిపింది.
First Published:  20 Jun 2015 1:08 PM GMT
Next Story