Telugu Global
NEWS

కడప జిల్లాలో రూ. 8 కోట్ల ఎర్ర చందనం స్వాధీనం

కడప జిల్లా తిప్పారెడ్డిపల్లి క్రాస్ రోడ్డు వద్ద తనిఖీలు చేస్తుండగా అంతర్జాతీయ ఎర్ర చందనం స్మగ్లర్ గంగిరెడ్డి ప్రధాన అనుచరుడు జంగాల శివశంకర్‌ టాస్క్‌ఫోర్స్ పోలీసులకు పట్టుబడ్డాడు. అతనితోపాటు మరో ఏడుగురు స్మగ్లర్లు కూడా వీరికి దొరికిపోయారు. వీరి నుంచి అందిన సమాచారం ప్రకారం టాస్క్‌ఫోర్స్ అధికారులు దాడి చేయగా అక్రమంగా దాచి ఉంచిన ఎనిమిది కోట్ల రూపాయల విలువైన ఎర్ర చందనం బయటపడింది. ఇక్కడున్న మొత్తం నాలుగు టన్నుల ఎర్ర చందనాన్ని టాస్క్‌ఫోర్స్‌ అధికారులు స్వాధీనం […]

కడప జిల్లా తిప్పారెడ్డిపల్లి క్రాస్ రోడ్డు వద్ద తనిఖీలు చేస్తుండగా అంతర్జాతీయ ఎర్ర చందనం స్మగ్లర్ గంగిరెడ్డి ప్రధాన అనుచరుడు జంగాల శివశంకర్‌ టాస్క్‌ఫోర్స్ పోలీసులకు పట్టుబడ్డాడు. అతనితోపాటు మరో ఏడుగురు స్మగ్లర్లు కూడా వీరికి దొరికిపోయారు. వీరి నుంచి అందిన సమాచారం ప్రకారం టాస్క్‌ఫోర్స్ అధికారులు దాడి చేయగా అక్రమంగా దాచి ఉంచిన ఎనిమిది కోట్ల రూపాయల విలువైన ఎర్ర చందనం బయటపడింది. ఇక్కడున్న మొత్తం నాలుగు టన్నుల ఎర్ర చందనాన్ని టాస్క్‌ఫోర్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వల్లూరు వద్ద ఈ డంప్ ఉన్నట్టు తెలుసుకుని దానిపై దాడి చేశారు. అక్కడున్న మొత్తం ఎర్ర చందనాన్ని స్వాధీనం చేసుకున్నారు. కడప జిల్లా, కర్ణాటక ప్రాంతాలకు చెందిన ఈ ఎనిమిది మంది స్మగ్లర్ల నుంచి నాలుగు కార్లు, ఒక లారీని స్వాధీనం చేసుకున్నారు.
First Published:  20 Jun 2015 2:04 AM GMT
Next Story