Telugu Global
Others

ప్రేమ రెండు ముక్క‌ల‌య్యింది... ఇలా!

త‌న మాజీ ప్రేయ‌సి త‌న గుండెను రెండు ముక్క‌లు చేసింద‌ని, ప‌దిలంగా ఉంచుకున్న హృద‌యం ముక్క‌లైపోయింద‌ని వాపోతున్నాడు. అంత‌టితో ఆగాడా… అంటే లేద‌నే చెప్పాలి. ఎందుకంటారా? త‌న హృద‌యం ప‌గిలిపోయింద‌ని చెప్ప‌డానికి… గుండె రెండు ముక్క‌లైపోయింద‌ని సింబాలిక్‌గా తెలప‌డానికి, ఆమెతో క‌లిసి వాడిన అన్ని వ‌స్తువుల‌ను రెండు ముక్క‌లు చేసి చూపించాడు. జర్మనీకి చెందిన ఓ యువకుడు ..లారా అనే ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ పై కోపంతో …గతంలో తామిద్దరూ కలిసి ఉన్నప్పుడు వాడిన వస్తువులన్నింటినీ సగానికి […]

ప్రేమ రెండు ముక్క‌ల‌య్యింది... ఇలా!
X
త‌న మాజీ ప్రేయ‌సి త‌న గుండెను రెండు ముక్క‌లు చేసింద‌ని, ప‌దిలంగా ఉంచుకున్న హృద‌యం ముక్క‌లైపోయింద‌ని వాపోతున్నాడు. అంత‌టితో ఆగాడా… అంటే లేద‌నే చెప్పాలి. ఎందుకంటారా? త‌న హృద‌యం ప‌గిలిపోయింద‌ని చెప్ప‌డానికి… గుండె రెండు ముక్క‌లైపోయింద‌ని సింబాలిక్‌గా తెలప‌డానికి, ఆమెతో క‌లిసి వాడిన అన్ని వ‌స్తువుల‌ను రెండు ముక్క‌లు చేసి చూపించాడు. జర్మనీకి చెందిన ఓ యువకుడు ..లారా అనే ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ పై కోపంతో …గతంలో తామిద్దరూ కలిసి ఉన్నప్పుడు వాడిన వస్తువులన్నింటినీ సగానికి కోసేశాడు. ఈ విధంగా తన గుండె ఒక్కటి మాత్రమే కాదు.. మ‌న‌సుతోపాటు స‌మ‌స్తం విరిగిపోయాయ‌ని తన మాజీ భార్యకు చెప్పాలనుకున్నాడో ఏమో. తాము ప్రయాణించిన కారు దగ్గర నుంచి… కూర్చునే కుర్చీ వరకూ అతగాడు ఏదీ వదలలేదు. టీవీ, సీడీలు, లాప్ టాప్, సెల్ ఫోన్, ఐఫోన్, సైకిల్, హెల్మెట్, సోఫా, బెడ్, చివరకు టెడ్డీ బేర్ బొమ్మను కూడా సగానికి చక్కగా కోసేసి… మాజీ భార్యకు పంపించాడు. అంతేకాకుండా ఈ నిర్వాకాన్ని మొత్తం వీడియో తీసీ యూట్యూబ్ లో పెట్టాడు. ఆ వీడియోకు మంచి రెస్పాన్స్ రావడటంతో అయ్యగారు తనవద్ద మిగిలి వున్న మిగతా సగ భాగాలను ఈబే మార్కెటింగ్ వెబ్‌సైట్‌ లో పెట్టి పెద్ద మొత్తంలో సొమ్ము చేసుకున్నాడు. మరక కూడా మంచిదే అన్నట్లు… ‘సగం’ కూడా ఆ జర్మన్ యువకుడికి మంచి లాభాలనే తెచ్చిపెట్టాయి!
Next Story