Telugu Global
Cinema & Entertainment

ఇంతకి త్రివిక్రమ్ "జ్యోతిలక్ష్మి" ఎవరు ?

సన్నాఫ్ సత్యమూర్తి తరువాత త్రివిక్రమ్ తన తదుపరి సినిమా ఎవరితో అనేది ఇంతవరకు ప్రకటించలేదు. ప్రస్తుత్తం పవన్ గబ్బర్ సింగ్ 2 సినిమాతో బిజిబిజిగా ఉండటం, ఎన్టీఆర్ శ్రీకాంత్ అడ్డాల సినిమాలో బిజిబిజిగా ఉండటం అదే విధంగా మహేష్ శ్రీమంతుడు, బ్రహ్మోత్సవం వంటి సినిమాలతో డేట్స్ లేకపోవటంతో త్రివిక్రమ్ అగ్ర హీరోలెవరితో చేసే అవకాశం ప్రస్తుతానికి లేనట్టే. అయితే ఇప్పుడు త్రివిక్ర‌మ్ కూడా ఓ మ‌హిళా ప్రాధాన్య క‌థ‌ను చేస్తున్నాడ‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది.  బాలీవుడ్ లో అనుష్క […]

ఇంతకి త్రివిక్రమ్ జ్యోతిలక్ష్మి ఎవరు ?
X
సన్నాఫ్ సత్యమూర్తి తరువాత త్రివిక్రమ్ తన తదుపరి సినిమా ఎవరితో అనేది ఇంతవరకు ప్రకటించలేదు. ప్రస్తుత్తం పవన్ గబ్బర్ సింగ్ 2 సినిమాతో బిజిబిజిగా ఉండటం, ఎన్టీఆర్ శ్రీకాంత్ అడ్డాల సినిమాలో బిజిబిజిగా ఉండటం అదే విధంగా మహేష్ శ్రీమంతుడు, బ్రహ్మోత్సవం వంటి సినిమాలతో డేట్స్ లేకపోవటంతో త్రివిక్రమ్ అగ్ర హీరోలెవరితో చేసే అవకాశం ప్రస్తుతానికి లేనట్టే. అయితే ఇప్పుడు త్రివిక్ర‌మ్ కూడా ఓ మ‌హిళా ప్రాధాన్య క‌థ‌ను చేస్తున్నాడ‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది.
బాలీవుడ్ లో అనుష్క శ‌ర్మ ఎన్‌హెచ్10, దీపికా ప‌దుకొనే “పీకూ” చిత్రం, కంగ‌నా ర‌నౌత్ మ‌ను వెడ్స్ త‌ను-2, .. చిత్రాలు ఎంత‌టి విజ‌యాలు సాధించాయో తెలిసిందే. ఇటీవ‌ల తెలుగులో విడుద‌లైన జ్యోతిల‌క్ష్మి చిత్రానికి కూడా ఆద‌ర‌ణ ల‌భిస్తున్న విష‌యం తెలిసిందే.ఈ నేప‌థ్యంలో లేడీ ఓరియంటెడ్ చిత్రంపై హీరోయిన్ సమంతా ఆస‌క్తి చూపుతున్న‌ట్టు తెలిసింది. డేట్ల కోసం తన వద్దకు వచ్చిన దర్శక, నిర్మాతలకు సమంతే స్వయంగా ఈ లేడీ ఓరియెంటెడ్ సినిమా గురించి చెప్పారట! రచయిత, దర్శకుడెవరన్నది మాత్రం సస్పెన్స్ లో పెట్టిందట. అయితే ఇప్పుడు త్రివిక్రమ్ స్క్రిప్ట్ రెడీ చేసాడని దర్శకత్వం వహిస్తాడా లేదా అనేది సందేహమే అని ఫిలిం నగర్ కబురు.
First Published:  18 Jun 2015 5:30 AM GMT
Next Story