Telugu Global
Others

6,000 కోట్లతో బిఎస్‌ఎన్‌ఎల్ వైఫై హాట్‌స్పాట్‌లు

ప్రభుత్వ రంగంలోని టెలికాం సంస్థ బిఎస్‌ఎన్‌ఎల్‌ దేశ వ్యాప్తంగా 40 వేల‌ వైఫై హాట్‌స్పాట్‌లు ఏర్పాటు చేయబోతోంది. 2018 నాటికి పూర్తయ్యే ఈ ప్రాజెక్టు కోసం రూ.6,000 కోట్లు ఖర్చు చేయనున్నట్టు కేంద్ర టెలికాం శాఖ మంత్రి రవి శంకర్‌ ప్రసాద్‌ చెప్పారు.  ఈ సంవత్సరం రూ.500 కోట్ల పెట్టుబడితో దేశంలోని 250 చోట్ల 2,500 వైఫై హాట్‌స్పాట్‌లు ఏర్పాటు చేస్తామని బిఎస్‌ఎన్‌ఎల్‌ సిఎండి అనుపమ్‌ శ్రీవాస్తవ చెప్పారు. ఇందులో ఇప్పటికే 200 చోట్ల వైఫై హాట్‌స్పాట్‌ల ఏర్పాటు […]

ప్రభుత్వ రంగంలోని టెలికాం సంస్థ బిఎస్‌ఎన్‌ఎల్‌ దేశ వ్యాప్తంగా 40 వేల‌ వైఫై హాట్‌స్పాట్‌లు ఏర్పాటు చేయబోతోంది. 2018 నాటికి పూర్తయ్యే ఈ ప్రాజెక్టు కోసం రూ.6,000 కోట్లు ఖర్చు చేయనున్నట్టు కేంద్ర టెలికాం శాఖ మంత్రి రవి శంకర్‌ ప్రసాద్‌ చెప్పారు. ఈ సంవత్సరం రూ.500 కోట్ల పెట్టుబడితో దేశంలోని 250 చోట్ల 2,500 వైఫై హాట్‌స్పాట్‌లు ఏర్పాటు చేస్తామని బిఎస్‌ఎన్‌ఎల్‌ సిఎండి అనుపమ్‌ శ్రీవాస్తవ చెప్పారు. ఇందులో ఇప్పటికే 200 చోట్ల వైఫై హాట్‌స్పాట్‌ల ఏర్పాటు పూర్తయిందన్నారు. త్వరలో పూరి జగన్నాధుడి ఆలయం, ఖజురహో వంటి యాత్రా స్థలాల్లో సైతం వీటిని ఏర్పాటు చేస్తామన్నారు.
First Published:  16 Jun 2015 1:13 PM GMT
Next Story