Telugu Global
International

మనవారి ప్రతిభకు అమెరికా జేజేలు...

అమెరికాలో ప్రతిఏటా మే నెలాఖరులో కాని జూన్ మొదటి వారంలో కాని ‘ నేషనల్ స్పెల్లింగ్ బీ ‘ అనే పోటి జరుగుతుంటుంది . 14 ఏండ్లు దాటని వారు ,8 వ గ్రేడు దాటని వారు ఈ పోటీలో పాల్గొనటానికి అర్హులు . గడచిన‌ 16 సంవత్సరాలలో 13 సార్లు భారతీయ-అమెరికన్లు ఈ పోటీల్లో గెలిచారు. ఈ యేడాది వన్యా శివశంకర్ ,గోకుల్ వెంటాచలా ఉమ్మడిగా విజేతలు .అరవింద్ మహంకాళి ,బాలు నటరాజన్ ,నూపుర్ లాలా […]

అమెరికాలో ప్రతిఏటా మే నెలాఖరులో కాని జూన్ మొదటి వారంలో కాని ‘ నేషనల్ స్పెల్లింగ్ బీ ‘ అనే పోటి జరుగుతుంటుంది . 14 ఏండ్లు దాటని వారు ,8 వ గ్రేడు దాటని వారు ఈ పోటీలో పాల్గొనటానికి అర్హులు . గడచిన‌ 16 సంవత్సరాలలో 13 సార్లు భారతీయ-అమెరికన్లు ఈ పోటీల్లో గెలిచారు. ఈ యేడాది వన్యా శివశంకర్ ,గోకుల్ వెంటాచలా ఉమ్మడిగా విజేతలు .అరవింద్ మహంకాళి ,బాలు నటరాజన్ ,నూపుర్ లాలా ,కావ్యా శివశంకర్ ,ప్రత్యూషా బుడిగ గత విజేతలలో కొందరు . భారతీయ మూలాలున్న బాలబాలికలే విజేతలుగా ఉండటం మీద విజ్ఞులు రకరకాల అభిప్రాయాలు వెల్లడించారు .భారతీయులకు ‘ భట్టీయం ‘లో ప్రతిభ ఎక్కువ .స్పెల్లింగులన్నీ భట్టీపెట్టి బహుమతులు లాగేస్తున్నారని కొంతమంది వాపోయారు .అమెరికాలో స్థిర పడ్డ మొదటితరం భారతీయులు తమ సంతతి చదువు మీద అమితమైన‌ శ్రద్ధ చూపెడుతుంటారు .తమ సమయం, ధనం పిల్లల చదువులకే ఎక్కువగా వ్యయం చేస్తుంటారు .మిగతా పిల్లలు సాకర్ ,ఫుట్ బాల్ ,బాస్కెట్ బాల్ ఆటస్థలాల్లో ఉంటే భారతీయ మూలాలవారు కోచింగ్ సెంటర్లలో ఉంటుంటారు . అందుకేనా ఈ విజయం..?

Next Story