Telugu Global
Others

ఎంఐఎంతో టి. కాంగ్రెస్ దోస్తనం కటీఫ్

ఓటుకు నోటు వ్యవహారంలో రేవంత్‌రెడ్డితో పాటు ఏపీ సీఎం చంద్రబాబుకు శిక్ష పడాల్సిందేనని, నేరం చేసి దొరకనివారికి కూడా శిక్ష పడాలని తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్‌ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. గాంధీభవన్‌లో తెలంగాణ కాంగ్రెస్ నేతలు సమావేశమయ్యారు. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్, పొన్నాల లక్ష్మయ్య, షబ్బీర్ అలీ, దానం నాగేందర్, సబిత, వీహెచ్, రేణుకా చౌదరి, తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ భేటీలో పార్టీ భవిష్యత్, ఏపీ, తెలంగాణలో రాహుల్ పర్యటన, జీహెచ్ఎంసీ […]

ఓటుకు నోటు వ్యవహారంలో రేవంత్‌రెడ్డితో పాటు ఏపీ సీఎం చంద్రబాబుకు శిక్ష పడాల్సిందేనని, నేరం చేసి దొరకనివారికి కూడా శిక్ష పడాలని తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్‌ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. గాంధీభవన్‌లో తెలంగాణ కాంగ్రెస్ నేతలు సమావేశమయ్యారు. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్, పొన్నాల లక్ష్మయ్య, షబ్బీర్ అలీ, దానం నాగేందర్, సబిత, వీహెచ్, రేణుకా చౌదరి, తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ భేటీలో పార్టీ భవిష్యత్, ఏపీ, తెలంగాణలో రాహుల్ పర్యటన, జీహెచ్ఎంసీ ఎన్నికలపై ప్రధానంగా చర్చించారు. టీఆర్ఎస్, ఇతర పార్టీలకు అనుగుణంగా జరుగుతున్న డీలిమిటేషన్‌కు వ్యతిరేకంగా జీహెచ్ఎంసీ ఎదుట ధర్నా నిర్వహించాలని, అదే విధంగా ఈ అంశంపై గవర్నర్‌కు ఫిర్యాదు చేయాలని ఉత్తమ్ పార్టీ నేతలకు సూచించారు. దేశ వ్యాప్తంగా ఎంఐఎం విస్తరిస్తోందని, దీని వల్ల కాంగ్రెస్ ఓటు బ్యాంకుకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని అభిప్రాయపడ్డారు. ఎంఐఎంతో ఎలాంటి పొత్తు పెట్టుకోకూడదని ఈ భేటీలో నిర్ణయించారు.
First Published:  14 Jun 2015 1:16 PM GMT
Next Story