మరోసారి పోలీస్ అధికారిగా..
ఇప్పటికే చాలాసార్లు పోలీస్ పాత్రల్లో కనిపించాడు కమల్ హాసన్. రొటీన్ గా పోలీస్ పాత్రలు చేసినప్పటికీ అందులో కూడా కాస్త విలక్షణత చూపించగలిగాడు. అందుకే మరోసారి అతడ్ని పోలీస్ గా, డిఫరెంట్ గా చూపించేందుకు ప్రయత్నిస్తున్నాడు దర్శకుడు రాజేష్ సెల్వం. అవును.. తెలుగు-తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కుతున్న చీకటిరాజ్యం సినిమాలో కమల్ మరోసారి పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. ఈ సినిమాలో పోలీస్ పాత్ర కోసం కమల్ ఓ డిఫరెంట్ గెటప్ ట్రైచేస్తున్నాడు. […]
BY admin13 Jun 2015 2:12 AM GMT
X
admin Updated On: 13 Jun 2015 2:12 AM GMT
ఇప్పటికే చాలాసార్లు పోలీస్ పాత్రల్లో కనిపించాడు కమల్ హాసన్. రొటీన్ గా పోలీస్ పాత్రలు చేసినప్పటికీ అందులో కూడా కాస్త విలక్షణత చూపించగలిగాడు. అందుకే మరోసారి అతడ్ని పోలీస్ గా, డిఫరెంట్ గా చూపించేందుకు ప్రయత్నిస్తున్నాడు దర్శకుడు రాజేష్ సెల్వం. అవును.. తెలుగు-తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కుతున్న చీకటిరాజ్యం సినిమాలో కమల్ మరోసారి పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. ఈ సినిమాలో పోలీస్ పాత్ర కోసం కమల్ ఓ డిఫరెంట్ గెటప్ ట్రైచేస్తున్నాడు.
నిజానికి చీకటిరాజ్యం షూటింగ్ ను మారిషస్ లో ప్లాన్ చేశారు. కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల షూటింగ్ ను హైదరాబాద్ లోనే కొనసాగిస్తున్నారు. కమల్ సరసన త్రిష, మధుషాలిని హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు జిబ్రాన్ స్వరాలు సమకూరుస్తున్నారు. కమల్ హాసన్ లైఫ్ పార్ట్ నర్ గౌతమి కూడా హైదరాబాద్ లోనే ఉన్నారు. మేజర్ షూటింగ్ ను హైదరాబాద్ లోనే కానిచ్చేసి, కేవలం పాటల కోసమే విదేశాలకు వెళ్లాలనే ఆలోచనలో ఉంది కమల్ టీం. ఫస్ట్ లుక్ ఆవిష్కరణ రోజే చెప్పినట్టు సినిమా కథ పాతదే అయినప్పటికీ.. ట్రీట్ మెంట్ డిఫరెంట్ గా ఉండబోతోంది.
Next Story