Telugu Global
Cinema & Entertainment

పురీ-నితిన్ సినిమాని జ్యోతిలక్ష్మి చెడకొట్టిందా?

మీడియా సర్కిల్స్‌లో వస్తున్న కథనాలను బట్టి నిజమనే అనుకోవాలి. పూరీ-నితిన్ యొక్క కోంబో ప్రకటించగానే ఒక ఎక్జైటింగ్ ప్రాజెక్ట్ ఉండబోతుందనే టాక్ వచ్చింది. కాని ఈ ప్రాజెక్ట్ నుండి నితిన్ తప్పుకోవడం వెనుక ‘జ్యోతిలక్ష్మి’ చార్మి హ్యాండ్ ఉందనే గాసిప్ ఎక్కువగా వస్తోంది. నితిన్ ఫాదర్ సుధాకర్‌రెడ్డికి పూరీ-నితిన్ ప్రాజెక్ట్ మొత్తం హ్యాండిల్ చేయాలని ఉందని, కాని పూరీ మాత్రం చార్మీ ప్రొడక్షన్ హ్యాండిల్ చేస్తుందని పట్టుబట్టడం వలననే చెడిందనే మాటలు వినబడుతున్నాయి. ఇందులో ఎంత నిజముందనేది […]

పురీ-నితిన్ సినిమాని జ్యోతిలక్ష్మి చెడకొట్టిందా?
X

మీడియా సర్కిల్స్‌లో వస్తున్న కథనాలను బట్టి నిజమనే అనుకోవాలి. పూరీ-నితిన్ యొక్క కోంబో ప్రకటించగానే ఒక ఎక్జైటింగ్ ప్రాజెక్ట్ ఉండబోతుందనే టాక్ వచ్చింది. కాని ఈ ప్రాజెక్ట్ నుండి నితిన్ తప్పుకోవడం వెనుక ‘జ్యోతిలక్ష్మి’ చార్మి హ్యాండ్ ఉందనే గాసిప్ ఎక్కువగా వస్తోంది. నితిన్ ఫాదర్ సుధాకర్‌రెడ్డికి పూరీ-నితిన్ ప్రాజెక్ట్ మొత్తం హ్యాండిల్ చేయాలని ఉందని, కాని పూరీ మాత్రం చార్మీ ప్రొడక్షన్ హ్యాండిల్ చేస్తుందని పట్టుబట్టడం వలననే చెడిందనే మాటలు వినబడుతున్నాయి.

ఇందులో ఎంత నిజముందనేది పూరీకి మరియు నితిన్‌కే తెలియాలి. అసలు ఈ సినిమాకి సుధాకర్‌రెడ్డి ఆల్‌రెడీ అడ్వాన్స్ ఇచ్చేసాడని, కాని చార్మీ ఎంట్రీతో అంతా మారిపోయిందని, పూరీ చార్మీ విషయంలో ఎందుకు ఇంత పట్టుదలతో ఉన్నాడో అర్థం కావట్లేదని, డెక్కన్ క్రానికిల్‌లో కథనాలు వచ్చాయి. నితిన్ ప్రాజెక్ట్‌లో మొదట రెజినాని సంప్రదించారని కాని చార్మి, దిషా పటేల్ కోసం రెజినాని కాదన్నారని కూడా రూమర్ పాకుతోంది. ప్రముఖంగా చార్మీని దూరంగా ఉంచడానికి పూరీ ఒప్పుకోకపోవడం వలననే నితిన్, పూరీ ప్రాజెక్ట్ నుండి వాక్-అవుట్ చేసాడని కథనం. లోగుట్టు పెరుమాళ్ళకు ఎరుక!

First Published:  13 Jun 2015 4:05 AM GMT
Next Story