Telugu Global
Others

ట్యాంకర్‌ నుంచి గ్యాస్ లీక్-ఆరుగురు మృతి

పంజాబ్ రాష్ట్రం లుధియానా సమీపంలో అమ్మోనియా ల్యాంకర్‌ నుంచి గ్యాస్‌ లీకైన ఘటనలో ఆరుగురు మృతి చెందగా, 100 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ర‌వాణాకు అవ‌కాశం లేని ఓ ఫ్లైఓవర్‌ కింద నుంచి ట్యాంక‌ర్ వెళ్లేందుకు ప్రయత్నించడంతో ఈ వాహ‌నం ప్రమాదానికి గురైంది. ఫ్లైఓవర్‌ తగినంత ఎత్తు లేకపోయినా దాని కింద నుంచి ట్యాంకర్‌ను పోనిచ్చేందుకు డ్రైవర్‌ ప్రయత్నించాడు. దాంతో ట్యాంకర్‌ పైభాగం దెబ్బతిని గ్యాస్‌ లీకైంది. ట్యాంకర్‌లో నుంచి వెలువడిన అమ్మోనియా వాయువు పీల్చి […]

పంజాబ్ రాష్ట్రం లుధియానా సమీపంలో అమ్మోనియా ల్యాంకర్‌ నుంచి గ్యాస్‌ లీకైన ఘటనలో ఆరుగురు మృతి చెందగా, 100 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ర‌వాణాకు అవ‌కాశం లేని ఓ ఫ్లైఓవర్‌ కింద నుంచి ట్యాంక‌ర్ వెళ్లేందుకు ప్రయత్నించడంతో ఈ వాహ‌నం ప్రమాదానికి గురైంది. ఫ్లైఓవర్‌ తగినంత ఎత్తు లేకపోయినా దాని కింద నుంచి ట్యాంకర్‌ను పోనిచ్చేందుకు డ్రైవర్‌ ప్రయత్నించాడు. దాంతో ట్యాంకర్‌ పైభాగం దెబ్బతిని గ్యాస్‌ లీకైంది. ట్యాంకర్‌లో నుంచి వెలువడిన అమ్మోనియా వాయువు పీల్చి ఆరుగురు మరణించారు. మరో వంద మంది అస్వస్థతకు గురయ్యారు. ట్యాంకర్‌ ప్రమాదానికి గురి కాగానే స్థానికులు ఇళ్ల నుంచి బయటకు రావడంతో వారంతా ఒక్కసారిగా శ్వాస ఆడ‌క ఉక్కిరిబిక్కిరై అనారోగ్యం పాలయ్యారు. బాధితులను దోరహా, కన్నా, లుధియానా ఆస్పత్రులకు తరలించి చికిత్స అందజేస్తున్నారు. ఇందులో కొంద‌రి ప‌రిస్థితి విష‌మంగా ఉంద‌ని ఆస్ప‌త్రి వ‌ర్గాలు చెబుతున్నాయి.
First Published:  12 Jun 2015 1:08 PM GMT
Next Story