నిజంగానే పండగ చేసుకున్నాడు..
ఈకాలం ఏ సినిమా హిట్టవుతుందో కచ్చితంగా చెప్పలేకపోతున్నాం. మంచి కథా బలం ఉండి కచ్చితంగా హిట్టవుతుందనుకున్న సినిమాలు బోల్తాపడుతున్నాయి. రొటీన్ మాస్ మసాలాస్ తో తెరకెక్కి సోసో మూవీగా అనుకునే సినిమాలు సూపర్ హిట్టవుతున్నాయి. దీనికి తాజా ఎగ్జాంపుల్ పండగ చేస్కో. పక్కా రొటీన్ కథ, అంతకుమించి రొటీన్ స్క్రీన్ ప్లే. ఇప్పటికే ఎన్నోసార్లు చూసామనే ఫీలింగ్ కలిగించే సినిమా. అయినప్పటికీ పండగ చేస్కో సినిమా బాక్సాఫీస్ ముందు కాసులు కురిపించింది. ప్రేక్షకులు ఎగబడి చూశారు ఈ […]
BY admin11 Jun 2015 1:19 AM GMT
X
admin Updated On: 11 Jun 2015 1:19 AM GMT
ఈకాలం ఏ సినిమా హిట్టవుతుందో కచ్చితంగా చెప్పలేకపోతున్నాం. మంచి కథా బలం ఉండి కచ్చితంగా హిట్టవుతుందనుకున్న సినిమాలు బోల్తాపడుతున్నాయి. రొటీన్ మాస్ మసాలాస్ తో తెరకెక్కి సోసో మూవీగా అనుకునే సినిమాలు సూపర్ హిట్టవుతున్నాయి. దీనికి తాజా ఎగ్జాంపుల్ పండగ చేస్కో. పక్కా రొటీన్ కథ, అంతకుమించి రొటీన్ స్క్రీన్ ప్లే. ఇప్పటికే ఎన్నోసార్లు చూసామనే ఫీలింగ్ కలిగించే సినిమా. అయినప్పటికీ పండగ చేస్కో సినిమా బాక్సాఫీస్ ముందు కాసులు కురిపించింది. ప్రేక్షకులు ఎగబడి చూశారు ఈ సినిమాని. ఒక్క ముక్కలో చెప్పాలంటే రామ్ నిజంగానే పండగ చేసుకున్నాడు.
పండగ చేస్కో రిలీజ్ టైమ్ కు పెద్ద సినిమాలేం లేవు. ఈ సినిమాకు వసూళ్లు భారీగా రావడానికి ఇదొక కారణమైతే.. ఆ తర్వాతొచ్చిన సింగం-123, అసుర సినిమాలు రెండూ మెప్పించకపోవడంతో ఒక్కసారిగా వాక్యూమ్ ఏర్పడింది. దీంతో జనాలంతా పండగ చేస్కో మూవీకి మరోసారి ఓటేశారు. అలా వరుసగా 2 వారాలు ఏకథాటిగా ఆడేయడంతో రామ్ సినిమాకి కలెక్షన్లు పోటెత్తాయి. ఏదైతేనేం చాన్నాళ్ల గ్యాప్ తర్వాత ఓ హిట్ కొట్టేశాడు రామ్.
Next Story