Telugu Global
Others

గుడుంబా డాన్‌ శంకర్‌సింగ్‌ అరెస్టు

గుడుంబా డాన్‌ నింబా శంకర్‌సింగ్‌ను గచ్చిబౌలి పోలీసులు అరెస్టు చేశారు. ఇతడు 83 లిక్కర్‌ కేసుల్లో నిందితుడు. అతడి వద్ద నుంచి అరకిలో గంజాయి, లిక్కర్‌ సాచెట్‌లు వంద, ఖాళీ ప్లాస్టిక్‌ కవర్లు వంద, రెండు బ్యాగ్‌ల నల్లబెల్లం, 30 కిలోల పంచదార, రెండు డిస్టిల్డ్‌ పైపులు, రెండు డ్రమ్ములను స్వాధీనం చేసుకున్నామని సీఐ జె. రమేష్‌కుమార్‌ విలేకరులకు చెప్పారు. శంకర్‌సింగ్‌ లిక్కర్‌ తయారీ అమ్మకం దారుడని, నానక్‌రాంగూడ, చందనాయక్‌తండా, ఖానామెట్‌ తదితర ప్రాంతాల్లో ఎక్కువ ధరకు […]

గుడుంబా డాన్‌ నింబా శంకర్‌సింగ్‌ను గచ్చిబౌలి పోలీసులు అరెస్టు చేశారు. ఇతడు 83 లిక్కర్‌ కేసుల్లో నిందితుడు. అతడి వద్ద నుంచి అరకిలో గంజాయి, లిక్కర్‌ సాచెట్‌లు వంద, ఖాళీ ప్లాస్టిక్‌ కవర్లు వంద, రెండు బ్యాగ్‌ల నల్లబెల్లం, 30 కిలోల పంచదార, రెండు డిస్టిల్డ్‌ పైపులు, రెండు డ్రమ్ములను స్వాధీనం చేసుకున్నామని సీఐ జె. రమేష్‌కుమార్‌ విలేకరులకు చెప్పారు. శంకర్‌సింగ్‌ లిక్కర్‌ తయారీ అమ్మకం దారుడని, నానక్‌రాంగూడ, చందనాయక్‌తండా, ఖానామెట్‌ తదితర ప్రాంతాల్లో ఎక్కువ ధరకు విక్రయిస్తుంటాడని పేర్కొన్నారు. రాయదుర్గం, ఎక్సైజ్‌, ఎక్సైజ్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ పోలీస్‌స్టేషన్‌లలో అతడు పలు కేసుల్లో నిందితుడని తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు.
First Published:  10 Jun 2015 1:22 PM GMT
Next Story