Telugu Global
Others

టీఆర్ఎస్‌ స్టింగ్ ఆపరేషన్‌కు ఏసీబీ స్టాంప్ : చంద్రబాబు

తెలుగు రాష్ట్రాలను వేడెక్కించిన ఓటుకు నోటు, ఫోన్ ట్యాపింగ్ సంఘటనల నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణ సర్కారుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం రాష్ట్రపతి, ప్రధానమంత్రులతో సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడిన చంద్రబాబు తెలంగాణ ప్రభుత్వ వైఖరిని తప్పుబట్టారు. రాష్ట్ర విభజన జరిగిన నాటి నుంచీ కెసిఆర్ సర్కారు కక్షపూరిత ధోరణితో వ్యవహరిస్తోందన్నారు. హైదరాబాద్ లో శాంత్రిభద్రతలు గవర్నర్ చేతిలో ఉండాలని కేంద్రాన్ని కోరామని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. విభజన చట్టంలోని […]

టీఆర్ఎస్‌ స్టింగ్ ఆపరేషన్‌కు ఏసీబీ స్టాంప్ : చంద్రబాబు
X
తెలుగు రాష్ట్రాలను వేడెక్కించిన ఓటుకు నోటు, ఫోన్ ట్యాపింగ్ సంఘటనల నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణ సర్కారుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం రాష్ట్రపతి, ప్రధానమంత్రులతో సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడిన చంద్రబాబు తెలంగాణ ప్రభుత్వ వైఖరిని తప్పుబట్టారు. రాష్ట్ర విభజన జరిగిన నాటి నుంచీ కెసిఆర్ సర్కారు కక్షపూరిత ధోరణితో వ్యవహరిస్తోందన్నారు. హైదరాబాద్ లో శాంత్రిభద్రతలు గవర్నర్ చేతిలో ఉండాలని కేంద్రాన్ని కోరామని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. విభజన చట్టంలోని సెక్షన్ 8, 9 అమలు చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశానని వెల్లడించారు. బుధవారం రాత్రి ఢిల్లీలో ఆయన విలేకరులతో మాట్లాడారు. అన్ని రాష్ట్రాలతో సమానంగా ఏపీ అభివృద్ధి చెందే వరకు సహాయం చేయాలని ప్రధాని మోడీని కోరినట్టు చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అక్రమాలకు పాల్పడిందని ఆరోపించారు. అనైతిక దారిలో ఐదుగురు ఎమ్మెల్సీల‌ను గెలిపించుకుంద‌ని చంద్ర‌బాబు ఆరోపించారు. కావాలనే స్టింగ్ ఆపరేషన్ చేశారని, దీనికి ఏసీబీ స్టాంప్ వేశారన్నారు. ఏసీబీ స్టింగ్ ఆపరేషన్ చేస్తే ఆ వివరాలను సీల్డ్ కవర్‌లో ఉంచి కోర్టుకు సమర్పించాలన్నారు. అలా కాకుండా సొంత‌ మీడియాకు లీక్ చేశారని తెలిపారు. ఫోన్ టాపింగ్ అక్రమం, పెద్ద నేరం అన్నారు. ఫోన్ రికార్డింగ్ కూడా అక్రమన్నారు. దేశంలోకి అక్రమంగా వచ్చిన వస్తువులతో టాపింగ్ చేస్తున్నారని ఆరోపించారు. ఎక్కడెక్కడో మాటలను అతికించారని, ఫ్యాబ్రికేట్ చేశారని అన్నారు. ఆడియో ఫ్యాబ్రికేటెడ్ అంటున్నారు, అలాంటప్పుడు టాపింగ్ సాధ్యం కాదుకదా అని ప్రశ్నించిన విలేకరిపై చంద్రబాబు అస‌హ‌నం ప్ర‌ద‌ర్శించారు.
రేవంత్ రెడ్డి వ్యవహారం గురించి అడిగినప్పుడు… తమ ఎమ్మెల్యేలను తీసుకెళ్లి మంత్రులను చేసినప్పుడు ఎందుకు ప్రశ్నించలేదంటూ ఎదురు ప్ర‌శ్న వేశారు. నామినేటెడ్ ఎమ్మెల్యేతో తాను మాట్లాడినట్టుగా బయటకు వచ్చిన ఆడియో టేపులపై మాట్లాడాల్సిన అవసరం తనకు లేదన్నారు. ఫోన్లు టాప్ చేశామని తెలంగాణ హోంమంత్రి చెప్పారని పేర్కొన్నారు. ఫోన్ టాపింగ్ పై విచారణ చేయాలని ప్రధాని మోడీకి చెప్పామన్నారు. ఉన్నతస్థాయి దర్యాప్తుతో అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని చంద్రబాబు అన్నారు. ఇరు రాష్ట్రాల సమస్యలను పరిష్కరించాలన్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య సమస్యల పరిష్కారం కోసం తానే చర్చలకు ఆహ్వానించానని, సాగునీటి విషయంలో ఇరు రాష్ట్రాల పోలీసులూ గొడవపడితే.. సమస్య పరిష్కారానికి తానే చొరవ తీసుకుని కెసిఆర్‌తో మాట్లాడానని చంద్రబాబు పేర్కొన్నారు. రాజకీయ లబ్ధి కోసం కెసిఆర్ విభేదాలు సృష్టిస్తున్నారని దుయ్యబట్టారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో కావాలనే ఆయ‌న రాజకీయ విభేదాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రెండు ప్రభుత్వాలు ఒక రాజధానిలో ఉన్నాయన్నారు. ఎవరి పరిధిలో వారు పనిచేసుకోవాలని, అందుకే సెక్షన్ 8 పెట్టారని తెలిపారు.
First Published:  10 Jun 2015 8:37 PM GMT
Next Story