Telugu Global
Others

కిడ్నీలో 420 రాళ్లు.. వెలికితీసిన చైనా వైద్యులు

 చైనాలో ఓ వ్యక్తి మూత్రపిండాల నుంచి వైద్యులు ఏకంగా 420 రాళ్లను వెలికితీసారు. అదీ ఒక్క కిడ్నీలోనేనట. సుమారు రెండు గంటలపాటు జరిగిన శస్త్రచికిత్సలో ఈ రాళ్లను వెలికి తీయడానికే 45 నిమిషాలు పట్టిందని వైద్యులు తెలిపారు. ఇంతవరకు కిడ్నీలో నుంచి ఈ స్థాయిలో రాళ్లు బయటపడలేదని వార‌న్నారు. స్థానికంగా దొరికే జిప్సమ్‌ టోఫు అనే ఆహార పదార్థాన్ని ప్రతిరోజూ పెద్ద మొత్తంలో తీసుకోవడమే బాధితుడికీ పరిస్థితి తెచ్చిపెట్టిందట. ఇందులో కాల్షియం మోతాదు కాస్త ఎక్కువగా ఉంటుంది. […]

చైనాలో ఓ వ్యక్తి మూత్రపిండాల నుంచి వైద్యులు ఏకంగా 420 రాళ్లను వెలికితీసారు. అదీ ఒక్క కిడ్నీలోనేనట. సుమారు రెండు గంటలపాటు జరిగిన శస్త్రచికిత్సలో ఈ రాళ్లను వెలికి తీయడానికే 45 నిమిషాలు పట్టిందని వైద్యులు తెలిపారు. ఇంతవరకు కిడ్నీలో నుంచి ఈ స్థాయిలో రాళ్లు బయటపడలేదని వార‌న్నారు. స్థానికంగా దొరికే జిప్సమ్‌ టోఫు అనే ఆహార పదార్థాన్ని ప్రతిరోజూ పెద్ద మొత్తంలో తీసుకోవడమే బాధితుడికీ పరిస్థితి తెచ్చిపెట్టిందట. ఇందులో కాల్షియం మోతాదు కాస్త ఎక్కువగా ఉంటుంది. పైగా సరిపడా మంచినీళ్లు తాగే అలవాటు కూడా లేదు. దీంతో కిడ్నీలలో పేరుకొని పోయిన కాల్షియం రాళ్లుగా మారింద‌ని వైద్యులు వివరించారు. ఇకముందైనా టోఫు తినడం మానేసి, మంచినీళ్లు ఎక్కువగా తాగాలని వైద్యులు సూచించారు.
First Published:  10 Jun 2015 1:26 PM GMT
Next Story