Telugu Global
Others

మారన్‌ బ్రదర్స్‌...కు చెన్నై హైకోర్టులో చుక్కెదురు

మారన్‌ బ్రదర్స్‌… దయానిధి మారన్‌, కళానిధి మారన్‌కు మద్రాస్‌ హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఎయిర్‌సెల్‌ కేసులో తమ ఆస్తులను ఈడీ అటాచ్‌ చేయడంపై మారన్‌ సోదరులు వేసిన ఫిటిషన్‌ను మద్రాస్‌ హైకోర్టు కొట్టివేసింది. గత ఏప్రిల్‌లో రూ. 742 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ జప్తు చేసిన విషయం తెలిసిందే. ఈ ఆస్తులను తమకు అప్పగించేలా చేయాలని కోరుతూ మారన్‌ సోదరులు మద్రాస్‌ హైకోర్టును ఆశ్రయించారు. ఎయిర్‌సెల్‌ గ్రూప్‌లోని పెట్టుబడులను అమ్మేయాలంటూ శివశంకరన్‌పై అప్పటి టెలికాం […]

మారన్‌ బ్రదర్స్‌… దయానిధి మారన్‌, కళానిధి మారన్‌కు మద్రాస్‌ హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఎయిర్‌సెల్‌ కేసులో తమ ఆస్తులను ఈడీ అటాచ్‌ చేయడంపై మారన్‌ సోదరులు వేసిన ఫిటిషన్‌ను మద్రాస్‌ హైకోర్టు కొట్టివేసింది. గత ఏప్రిల్‌లో రూ. 742 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ జప్తు చేసిన విషయం తెలిసిందే. ఈ ఆస్తులను తమకు అప్పగించేలా చేయాలని కోరుతూ మారన్‌ సోదరులు మద్రాస్‌ హైకోర్టును ఆశ్రయించారు. ఎయిర్‌సెల్‌ గ్రూప్‌లోని పెట్టుబడులను అమ్మేయాలంటూ శివశంకరన్‌పై అప్పటి టెలికాం మంత్రి దయానిధి మారన్‌ ఒత్తిడి తెచ్చారనేది ప్రధాన అభియోగం… ఇందుకోసం దయానిధి మారన్‌ ముడుపులు తీసుకున్నారని ఆరోపణ.
First Published:  9 Jun 2015 1:21 PM GMT
Next Story