Telugu Global
Others

‘మెర్స్‌’ వైరస్‌తో జాగ్రత్త: డబ్ల్యూహెచ్‌వో

మిడిల్‌ ఈస్ట్‌ రెస్పిరేటరీ సిండ్రోమ్ (ఎంఈఆర్‌ఎస్)  వైరస్‌ పట్ల అన్ని దేశాలు అప్రమత్తంగా ఉండాలని అంతర్జాతీయ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) హెచ్చరించింది. ఒంటెల ద్వారా ప్రబలే అవకాశమున్న ఈ వైరస్‌తో 25 దేశాలు ప్రభావితమయ్యాయని డాక్టర్‌ పీటర్‌ బెన్‌ తెలిపారు. ఈ వైర‌స్ వ‌ల్ల ఇప్పటి వరకూ 1,190 కేసులు నమోదవ్వగా 444మంది మరణించారు. ప్రసుత్తం పశ్చిమాసియా దేశాల్లో ఈ వైరస్‌ వ్యాపిస్తోందని, ఆయా దేశాలకు రాకపోకల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఇటీవల దక్షిణ కొరియాలో […]

మిడిల్‌ ఈస్ట్‌ రెస్పిరేటరీ సిండ్రోమ్ (ఎంఈఆర్‌ఎస్) వైరస్‌ పట్ల అన్ని దేశాలు అప్రమత్తంగా ఉండాలని అంతర్జాతీయ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) హెచ్చరించింది. ఒంటెల ద్వారా ప్రబలే అవకాశమున్న ఈ వైరస్‌తో 25 దేశాలు ప్రభావితమయ్యాయని డాక్టర్‌ పీటర్‌ బెన్‌ తెలిపారు. ఈ వైర‌స్ వ‌ల్ల ఇప్పటి వరకూ 1,190 కేసులు నమోదవ్వగా 444మంది మరణించారు. ప్రసుత్తం పశ్చిమాసియా దేశాల్లో ఈ వైరస్‌ వ్యాపిస్తోందని, ఆయా దేశాలకు రాకపోకల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఇటీవల దక్షిణ కొరియాలో 95 కేసులను గుర్తించారు. వీరిలో ఏడుగురు మరణించారు. బహ్రెయిన్‌, ఖతార్‌, సౌదీ, యూఏఈల్లో పర్యటించి వచ్చిన ఒక కొరియన్‌తో ఈ వైరస్‌ దేశంలోకి ప్రవేశించిందని తెలుస్తోంది. కాగా, ఇది మనుషుల్లో ఎంతకాలం ఆశ్రమం పొందుతుందనే విషయాన్ని స్పష్టం చేయకున్నా, డబ్ల్యూహెచ్‌వో దీనిపై అన్ని దేశాలు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని హెచ్చ‌రించింది.
First Published:  9 Jun 2015 1:36 PM GMT
Next Story