Telugu Global
Others

చంద్రబాబుపై రాష్ట్రపతికి వైఎస్ జగన్ ఫిర్యాదు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఓటుకు నోటు కుంభ‌కోణంలో ప్ర‌ధాన సూత్ర‌ధారి అని ఆయ‌న‌పై త‌క్ష‌ణం చ‌ర్య‌లు తీసుకోవాల‌ని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని  కలిసి విజ్ఞ‌ప్తి చేశారు. మంగళవారం సాయంత్రం ఆయన తన ఎంపీలతో కలిసి రాష్ట్రపతితో భేటీ అయ్యారు. ఈసందర్భంగా తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలకోసం చంద్రబాబునాయుడు కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడిన విషయాన్ని రాష్ట్రపతి దృష్టికి తీసుకొచ్చారు. ఈ విషయంలో జోక్యం చేసుకోని చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని ఆయ‌న కోరారు. చంద్ర‌బాబుతోపాటు […]

చంద్రబాబుపై రాష్ట్రపతికి వైఎస్ జగన్ ఫిర్యాదు
X

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఓటుకు నోటు కుంభ‌కోణంలో ప్ర‌ధాన సూత్ర‌ధారి అని ఆయ‌న‌పై త‌క్ష‌ణం చ‌ర్య‌లు తీసుకోవాల‌ని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసి విజ్ఞ‌ప్తి చేశారు. మంగళవారం సాయంత్రం ఆయన తన ఎంపీలతో కలిసి రాష్ట్రపతితో భేటీ అయ్యారు. ఈసందర్భంగా తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలకోసం చంద్రబాబునాయుడు కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడిన విషయాన్ని రాష్ట్రపతి దృష్టికి తీసుకొచ్చారు. ఈ విషయంలో జోక్యం చేసుకోని చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని ఆయ‌న కోరారు. చంద్ర‌బాబుతోపాటు ఈ కేసుతో సంబంధ‌మున్న ప్ర‌తి ఒక్క‌రిపైనా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని, చ‌ట్ట‌బ‌ద్దంగా అధికారులు వ్య‌వ‌హ‌రించేలా చూడాల‌ని జ‌గ‌న్ రాష్ట్రప‌తిని కోరారు. అనంత‌రం జ‌గ‌న్ మీడియాతో మాట్లాడుతూ రెండు విష‌యాల‌ను తాను రాష్ట్రప‌తికి నివేదించాన‌ని చెప్పారు. ప్ర‌త్యేక హోదా క‌ల్పించాల‌ని కోర‌డం ఒక‌టైతే, ఓటుకు నోటు కుంభ‌కోణంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప్ర‌జాస్వామ్యం దెబ్బ‌తింద‌ని, దాన్ని కాపాడాల‌ని తాను కోరాన‌ని చెప్పారు. ఈ యేడాది కాలంలో చంద్ర‌బాబు అనేక అవినీతి కార్య‌క‌లాపాల‌కు పాల్ప‌డ్డార‌ని, ఇలా దండుకున్న డ‌బ్బుతో ఎమ్మెల్యేల‌ను కొనాల‌ని ప్ర‌య‌త్నించాడ‌ని, ఆవిష‌యాన్ని రాష్ట్రప‌తి ప్ర‌ణ‌బ్‌ముఖ‌ర్జీ దృష్టికి తెచ్చానని జ‌గ‌న్ తెలిపారు. చంద్ర‌బాబు, స్టీఫెన్‌స‌న్ ఫోన్ సంభాష‌ణ‌ల వివ‌రాల‌ను కూడా ఆయ‌న‌కు తెలిపాన‌ని జ‌గ‌న్ చెప్పారు. ఇలాంటి ముఖ్య‌మంత్రి ఒక రాష్ట్ర ప్ర‌భుత్వానికి అధినేత‌గా ప‌ని చేస్తారా అని ఆయ‌న మీడియా ముందు ప్ర‌శ్నించారు. ఇలా రెండ్ హ్యాండెడ్‌గా ప‌ట్టుబ‌డ్డ సీఎంను ఆరోప‌ణ‌ల ప‌త్రంలో ఎందుకు చేర్చ‌లేద‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. బుధ‌వారం ఆయ‌న కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో స‌మావేశ‌మై రాష్ట్రంలో ప్ర‌స్తుత ప‌రిస్థితిని వివ‌రిస్తారు.

First Published:  9 Jun 2015 8:08 AM GMT
Next Story