Telugu Global
Cinema & Entertainment

ఎకానమీ క్లాసులో బ్రాడ్‌ పిట్‌, ఏంజెలీనా జోలీ!

హాలీవుడ్‌ సెలబ్రిటీలు బ్రాడ్‌ పిట్‌, ఏంజెలినా జోలీ దంపతులు చాలా సింపుల్‌ మనుషులు. వాళ్లకి సొంత జెట్‌ విమానం ఉన్నా క్రిందటివారం మామూలు ప్రయాణికులతో పాటే విమానంలో ఎకానమీ క్లాసులో ప్రయాణించారు. వీరిద్దరే కాదు, వారి ఆరుగురు పిల్లలు కూడా సాధారణ పిల్లల్లాగే ప్రయాణించారు. వీళ్లు ముందుగా లాస్‌ ఏంజెలెస్‌ నుంచి పారిస్‌కు వచ్చారు. ఆ తర్వాత ఓ రెండు గంటలు తోటి ప్రయాణికులతో పాటే పారిస్ నుంచి నీస్‌కు వెళ్లే విమానం కోసం నిరీక్షించారు. ఇక […]

ఎకానమీ క్లాసులో బ్రాడ్‌ పిట్‌, ఏంజెలీనా జోలీ!
X

హాలీవుడ్‌ సెలబ్రిటీలు బ్రాడ్‌ పిట్‌, ఏంజెలినా జోలీ దంపతులు చాలా సింపుల్‌ మనుషులు. వాళ్లకి సొంత జెట్‌ విమానం ఉన్నా క్రిందటివారం మామూలు ప్రయాణికులతో పాటే విమానంలో ఎకానమీ క్లాసులో ప్రయాణించారు. వీరిద్దరే కాదు, వారి ఆరుగురు పిల్లలు కూడా సాధారణ పిల్లల్లాగే ప్రయాణించారు. వీళ్లు ముందుగా లాస్‌ ఏంజెలెస్‌ నుంచి పారిస్‌కు వచ్చారు. ఆ తర్వాత ఓ రెండు గంటలు తోటి ప్రయాణికులతో పాటే పారిస్ నుంచి నీస్‌కు వెళ్లే విమానం కోసం నిరీక్షించారు. ఇక తోటి ప్రయాణికుల ఆనందానికి అవధులు లేవు. నీస్‌కు వెళ్లే విమానం వచ్చాక బ్రాడ్‌ పిట్‌ దంపతులు బిజినెస్‌ క్లాసులో వెళ్లి కూర్చుంటారని అందరూ అనుకున్నారు. కాని బ్రాడ్‌, జోలీ పిల్లలను తీసుకుని ఎకానమీ క్లాసులో వెళ్లి కూర్చున్నారు. పిల్లలు సామాన్లు అందిస్తుంటే బ్రాడ్‌ వాటన్నిటినీ జాగ్రత్తగా హ్యాండ్‌ లగేజీ సర్దిపెట్టి పిల్లలను కూర్చోపెట్టాడు. బ్రాడ్‌ పిట్‌, ఏంజెలీనీ తమ మధ్యే ఉండడంతో నమ్మలేని తోటి ప్రయాణికులు గబగబ వారి ఫొటోలు తీస్తూ అక్కడికక్కడే సోషల్‌ మీడియాలో షేర్ చేసేశారు.
ప్రయివేటు జెట్‌ ఉండి కూడా ఇలా ఎకానమీ క్లాసులో ప్రయాణిస్తున్నారేమిటని కొందరు ప్రయాణికులకు సందేహం కలిగినా ఈ హాలీవుడ్‌ సెలబ్రిటీ దంపతులను చూసిన ఆనందంలో ఎవరూ ప్రశ్నలూ వేయలేదు. తోటి ప్రయాణికులు ఫొటోలు తీసుకుంటూ హాయ్‌ అంటుంటే బ్రాడ్‌ కూడా సామాన్లు సర్దుతూ వారికి నవ్వుతూ హాయ్‌ చెప్పాడు. ప్రతి ఏటా కేన్స్‌లో జరిగే అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలకు హాజరు అవుతుంటాడు. అక్కడ కూడా అందరితో కలిసిపోతూ తానే ఒక చిన్న కెమేరా పట్టుకుని సినిమా అభిమానుల ఫొటోలు తీస్తూ అందరితో కబుర్లు చెబుతూ కనిపిస్తుంటాడు. క్రిందటి వారమే ఏంజెలీనా 40వ పుట్టిన రోజును కుటుంబం మొత్తం చాలా సంతోషంగా జరుపుకొన్నారు. ఆ తర్వాత ఈ ప్రయాణం. వీరి ఆరుగురు పిల్లల్లో ముగ్గురు వీరిద్ద‌రికి పుట్టినవారు. (వీరిలో ఇద్దరు కవలలు.) మిగిలిన ముగ్గురినీ వీరు దత్తత తీసుకున్నారు. ఆది కూడా ఒక్కొక్క దేశం నుంచి ఒక్కొక్కరిని దత్తత చేసుకున్నారు. కంబోడియాకు చెందిన మ్యాడాక్స్‌ను 2002లో, ఇథియోపియాకు చెందిన జహారాను 2005లో, వియత్నాంకు చెందిన పాక్స్‌ను 2007లో వీరు దత్తత తీసుకుని అందరినీ సమానంగా పెంచుతున్నారు. గ్రేట్‌ కదా!

First Published:  9 Jun 2015 12:19 PM GMT
Next Story