Telugu Global
Others

బలమైన సాక్ష్యాలు లేకుండా చంద్రబాబు జోలికెళ్తారా ?

ఓటుకు నోటు ఎర కేసులో రేవంత్‌రెడ్డిని ఇప్ప‌టికే ఏసీబీ పోలీసులు విచారిస్తున్న విష‌యం తెలిసిందే. తెలంగాణ సంబ‌రాలు ముగిసిన వెంట‌నే చంద్ర‌బాబు-స్టీఫెన్‌స‌న్ ల ఫోన్ సంభాష‌ణ టేపులు బ‌య‌ట‌ప‌డ్డాయి. దీంతో దేశ‌వ్యాప్తంగా క‌ల‌క‌లం రేగింది. ఏపీ ప్ర‌భుత్వం ఒక్క‌సారిగా ఉలిక్కిప‌డింది. రేవంత్‌రెడ్డి ఘ‌ట‌న‌పై ఇప్ప‌టిదాకా నోరువిప్ప‌ని చంద్ర‌బాబు టేపుల వ్య‌వ‌హారంలోనూ ఎలాంటి ఖండ‌న‌లు చేయ‌లేదు. అనంత‌రం ప్రభుత్వ సమాచార సలహాదారు పరకాల ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ.. ఈరోజు బయటకు పొక్కిన ఆడియోలోని సంభాషణలోనిది ఏపీ సీఎం గొంతు […]

బలమైన సాక్ష్యాలు లేకుండా చంద్రబాబు జోలికెళ్తారా ?
X

ఓటుకు నోటు ఎర కేసులో రేవంత్‌రెడ్డిని ఇప్ప‌టికే ఏసీబీ పోలీసులు విచారిస్తున్న విష‌యం తెలిసిందే. తెలంగాణ సంబ‌రాలు ముగిసిన వెంట‌నే చంద్ర‌బాబు-స్టీఫెన్‌స‌న్ ల ఫోన్ సంభాష‌ణ టేపులు బ‌య‌ట‌ప‌డ్డాయి. దీంతో దేశ‌వ్యాప్తంగా క‌ల‌క‌లం రేగింది. ఏపీ ప్ర‌భుత్వం ఒక్క‌సారిగా ఉలిక్కిప‌డింది. రేవంత్‌రెడ్డి ఘ‌ట‌న‌పై ఇప్ప‌టిదాకా నోరువిప్ప‌ని చంద్ర‌బాబు టేపుల వ్య‌వ‌హారంలోనూ ఎలాంటి ఖండ‌న‌లు చేయ‌లేదు. అనంత‌రం ప్రభుత్వ సమాచార సలహాదారు పరకాల ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ.. ఈరోజు బయటకు పొక్కిన ఆడియోలోని సంభాషణలోనిది ఏపీ సీఎం గొంతు కాదని చెప్పారు.

తెలంగాణ ప్ర‌భుత్వం అంత త‌ప్పు చేస్తుందా?
చంద్ర‌బాబుకు, తెలంగాణ ప్ర‌భుత్వానికి మొద‌టి నుంచి ప‌డ‌టం లేదు. నీరు, విద్యుత్తు విష‌యంలో చంద్ర‌బాబు పేచీ పెడుతున్నార‌ని ప‌లుమార్లు కేంద్రానికి తెలంగాణ ప్ర‌భుత్వం ఫిర్యాదు చేసింది. అలాంటిది, ఒక రాష్ర్ట ముఖ్యమంత్రి, కేంద్రంలో చ‌క్రం తిప్ప‌గ‌ల వ్య‌క్తిపై కేసు పెట్టాలంటే.. ఎలాంటి సాక్ష్యాధారాలు లేకుండా ముందుకు వెళ్తుందా? ముమ్మాటికీ.. కాదు. త‌గిన‌న్ని సాక్ష్యాధారాలు దొరికాకనే, న్యాయ‌నిపుణుల స‌ల‌హా తీసుకున్నాకే చంద్ర‌బాబు ఆడియో టేపుల‌ను విడుద‌ల చేశార‌ని నిపుణులు అంటున్నారు.

మీడియా అండ‌దండ‌లు..!
సీఎం హోదాలో ఉండి అవినీతి ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న వ్య‌క్తిని కాపాడేందుకు మీడియా స‌మ‌ష్టిగా ప‌నిచేయ‌డం ఇక్క‌డ గ‌మ‌నించ‌ద‌గ్గ అంశం. ఇత‌ర పార్టీ నాయ‌కులు చిన్న కేసులో అరెస్ట‌యినా దేశం నాశ‌నం పోయింద‌ని మొత్తుకునే మీడియా.. చివ‌రికి చంద్ర‌బాబు దోషిగా నిల‌బ‌డేస‌రికి ఎదురుదాడి మొద‌లుపెట్టి స్వామిభ‌క్తిని చాటుకుంటున్నాయి. గ‌తంలో బాల‌కృష్ణ కాల్పుల కేసులోనూ ఇలాగే వ్య‌వ‌హ‌రించి త‌మ భ‌క్తిని చాటుకున్న ఆ మీడియాకు ఇప్పుడు మ‌రో అరుదైన అవ‌కాశం దొరికింది. మీడియా వ్య‌వ‌హార శైలి చూసి ప్ర‌జ‌లు విస్మ‌యానికి గురవుతున్నారు.

First Published:  8 Jun 2015 2:13 AM GMT
Next Story