Telugu Global
Arts & Literature

దాశరథి రంగాచార్య మృతి

ప్రముఖ తెలుగు రచయిత దాశరథి రంగాచార్య ఈ రోజు కన్ను మూశారు. ఆయన వయసు 87సంవత్సరాలు. అయన రాసిన ‘చిల్లర దేవుళ్ళు’  నవల తెలుగు సాహిత్యం లో ఓ  మైలు రాయి. అలాగే ‘మోదుగ పూలు’ నవల విశేష  ఆదరణ   పొందింది. మాయ జలతారు, రానున్నది ఏది నిజం, పావని, నల్ల నాగు మొదలైన ఆయన నవలలు చాలా ఖ్యాతి పొందాయి. ఆయన రాసిన ‘అమృతంగమయ’ నవల విదేశి నాగరికత ప్రభావం భారతీయ నాగరికతపై ఎలా […]

దాశరథి రంగాచార్య మృతి
X

ప్రముఖ తెలుగు రచయిత దాశరథి రంగాచార్య ఈ రోజు కన్ను మూశారు. ఆయన వయసు 87సంవత్సరాలు. అయన రాసిన ‘చిల్లర దేవుళ్ళు’ నవల తెలుగు సాహిత్యం లో ఓ మైలు రాయి. అలాగే ‘మోదుగ పూలు’ నవల విశేష ఆదరణ పొందింది. మాయ జలతారు, రానున్నది ఏది నిజం, పావని, నల్ల నాగు మొదలైన ఆయన నవలలు చాలా ఖ్యాతి పొందాయి. ఆయన రాసిన ‘అమృతంగమయ’ నవల విదేశి నాగరికత ప్రభావం భారతీయ నాగరికతపై ఎలా ఉందనే వస్తువు తో రాసారు.
అనేక అనువాద కథలు, నవలలు వెలువరించారు. ఇక్భాల్ కవితల్ని తెనిగించారు. ‘శబ్ద శ్వాస’ అనే వ్యాస సంపుటి, పురాణ విషయాలపై అక్షర మందాకిని అనే వ్యాస సంపుటి, బుద్దుని జీవితం పై ఒక నవల రాసారు. మహా భారతాన్ని తేట వచనం లో రాసారు. ‘జీవనయానం’ పేరుతో స్వీయ జీవిత చరిత్రను పాఠకులకు అందించారు. అయన సరళమైన తెలుగు లో అందించిన నాలుగు వేదాలు పాఠకులకు అందుబాటులో ఉన్నాయి.

First Published:  7 Jun 2015 11:18 PM GMT
Next Story