Telugu Global
Cinema & Entertainment

అల్లు అర్జున్ భుజాలపై భారం వేసేసారు!

అల్లు అర్జున్ కి తెలుగు నాట ఉన్నట్లే, కేరళలో కూడా మంచి ఫాలోయింగ్ ఉందని అందరికీ తెలిసిన విషయమే కదా! అందుకనే అతను నటించిన తెలుగు సినిమాలన్నింటికీ మల్లుల్యాండ్‌లో డబ్బింగ్ అయ్యి అక్కడ విడుదల అవుతుంటాయి. ఇదే అంశం గుణశేఖరుడి పాలిట బంగారు బాతుగా మారింది. వివరాల్లోకి వెళితే, డైరెక్టర్ గుణ శేఖర్ ‘రుద్రమదేవి ‘ సినిమాని తెలుగు-తమిళంలో ద్విభాషా చిత్రంగా రూపొందించాడు. ఈ రెండు భాషలలో అనుష్కకి మంచి ఫాలోయింగ్ ఉంది. తెలుగు నాట అల్లు […]

అల్లు అర్జున్ భుజాలపై భారం వేసేసారు!
X

అల్లు అర్జున్ కి తెలుగు నాట ఉన్నట్లే, కేరళలో కూడా మంచి ఫాలోయింగ్ ఉందని అందరికీ తెలిసిన విషయమే కదా! అందుకనే అతను నటించిన తెలుగు సినిమాలన్నింటికీ మల్లుల్యాండ్‌లో డబ్బింగ్ అయ్యి అక్కడ విడుదల అవుతుంటాయి. ఇదే అంశం గుణశేఖరుడి పాలిట బంగారు బాతుగా మారింది.

వివరాల్లోకి వెళితే, డైరెక్టర్ గుణ శేఖర్ ‘రుద్రమదేవి ‘ సినిమాని తెలుగు-తమిళంలో ద్విభాషా చిత్రంగా రూపొందించాడు. ఈ రెండు భాషలలో అనుష్కకి మంచి ఫాలోయింగ్ ఉంది. తెలుగు నాట అల్లు అర్జున్ క్రేజ్ కూడా అనుష్కకి కలిసొస్తుంది. తను చేసిన గోనగన్నారెడ్డి పాత్ర సినిమాకి ఒక హైలైట్ అనే టాక్ ఉంది.

కేరళలో అల్లు అర్జున్‌కి ఉన్న క్రేజ్‌ని దృష్టిలో పెట్టుకుని, ఇప్పుడు ‘రుద్రమదేవి ‘ని మళయాళంలో కూడా విడుదల చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన మళయాళం లోగో కూడా ఆవిష్కరించారు. మొత్తానికి, మల్లునాట మన తెలుగు తేజం ‘రుద్రమ ‘ కథ చాటడానికి మన బన్నీ పాత్రనే ముఖ్యం అని అనొకోవచ్చు సుమా!

First Published:  7 Jun 2015 2:16 AM GMT
Next Story