Telugu Global
Others

ద.మ.రైల్వేకి త్వ‌ర‌లో 700 కోచ్‌లు: జీఎం

దక్షిణ మధ్య రైల్వేకి త్వరలో 700 కోచ్‌లు రాబోతున్నాయని, అవి రాగానే ప్రస్తుతం నడుస్తున్న రైళ్లకు భోగీల సంఖ్యని పెంచుతామని దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ ప్రదీ్‌పకుమార్‌ శ్రీవాస్తవ తెలిపారు. దీంతో గుంటూరుకు రిజర్వేషన్‌ కోటా కూడా పెరుగుతుందని చెప్పారు. ఏపీ ఎక్స్‌ప్రెస్‌కు రైల్వేబోర్డు నుంచి గ్రీన్‌సిగ్నల్‌ రావాల్సి ఉందని, ఇందుకోసం తాము సన్నద్ధమై ఉన్నామన్నారు. బోర్డు నుంచి అనుమతి రాగానే ఏపీ ఎక్స్‌ప్రెస్‌ని పట్టాలెక్కిస్తామన్నారు. గుంటూరు – గుంతకల్లు డబ్లింగ్‌ పైనా రాష్ట్ర ప్రభుత్వంతో […]

దక్షిణ మధ్య రైల్వేకి త్వరలో 700 కోచ్‌లు రాబోతున్నాయని, అవి రాగానే ప్రస్తుతం నడుస్తున్న రైళ్లకు భోగీల సంఖ్యని పెంచుతామని దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ ప్రదీ్‌పకుమార్‌ శ్రీవాస్తవ తెలిపారు. దీంతో గుంటూరుకు రిజర్వేషన్‌ కోటా కూడా పెరుగుతుందని చెప్పారు. ఏపీ ఎక్స్‌ప్రెస్‌కు రైల్వేబోర్డు నుంచి గ్రీన్‌సిగ్నల్‌ రావాల్సి ఉందని, ఇందుకోసం తాము సన్నద్ధమై ఉన్నామన్నారు. బోర్డు నుంచి అనుమతి రాగానే ఏపీ ఎక్స్‌ప్రెస్‌ని పట్టాలెక్కిస్తామన్నారు. గుంటూరు – గుంతకల్లు డబ్లింగ్‌ పైనా రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదిస్తున్నామని చెప్పారు. అమరావతి రాజధానికి నూతన రైలుమార్గం నిర్మాణం తమకు పెద్ద పనేమి కాదని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణకు సహకరించి ఒక ప్రతిపాదనతో వస్తే తాము రైల్వే బోర్డుకు నివేదించి ఆమోదం తీసుకొని పనులు చేపడతామని చెప్పారు.
First Published:  5 Jun 2015 1:17 PM GMT
Next Story