Telugu Global
NEWS

పీత‌ల సుజాత కేసు క్లోజ్‌!

 ఇటీవ‌ల మంత్రి పీత‌ల సుజాత ఇంట్లో రూ.10 ల‌క్ష‌ల నోట్ల క‌ట్ట‌లు క‌ల‌క‌లం సృష్టించిన సంగ‌తి తెలిసిందే! ఈ వ్య‌వ‌హారంలో మంత్రికి లంచం ఇచ్చేందుకే ఆ డ‌బ్బు ఇచ్చార‌ని పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రిగింది. సంచీలో రూ.10 ల‌క్ష‌లు, డీఎస్సీ హాల్‌టికెట్ ల‌భించాయి. పైగా  అదేరోజు డీఎస్సీ ఫ‌లితాలు ప్ర‌క‌టించ‌డంతో ఈ అనుమానాలు మ‌రింత బ‌ల‌ప‌డ్డాయి. ఘ‌ట‌న‌పై పోలీసుల‌కు ఫిర్యాదు అందింది. దీనిపై విచార‌ణ ప్రారంభించారు. ఘ‌ట‌న‌పై మంత్రి, ఆమె తండ్రి, డ‌బ్బు వ‌దిలార‌ని చెబుతున్న త‌ల్లీ, […]

పీత‌ల సుజాత కేసు క్లోజ్‌!
X
ఇటీవ‌ల మంత్రి పీత‌ల సుజాత ఇంట్లో రూ.10 ల‌క్ష‌ల నోట్ల క‌ట్ట‌లు క‌ల‌క‌లం సృష్టించిన సంగ‌తి తెలిసిందే! ఈ వ్య‌వ‌హారంలో మంత్రికి లంచం ఇచ్చేందుకే ఆ డ‌బ్బు ఇచ్చార‌ని పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రిగింది. సంచీలో రూ.10 ల‌క్ష‌లు, డీఎస్సీ హాల్‌టికెట్ ల‌భించాయి. పైగా అదేరోజు డీఎస్సీ ఫ‌లితాలు ప్ర‌క‌టించ‌డంతో ఈ అనుమానాలు మ‌రింత బ‌ల‌ప‌డ్డాయి. ఘ‌ట‌న‌పై పోలీసుల‌కు ఫిర్యాదు అందింది. దీనిపై విచార‌ణ ప్రారంభించారు. ఘ‌ట‌న‌పై మంత్రి, ఆమె తండ్రి, డ‌బ్బు వ‌దిలార‌ని చెబుతున్న త‌ల్లీ, కూతుళ్లు త‌లా ఓ మాట చెప్పి మ‌రింత గంద‌ర‌గోళానికి దారి తీశారు. ఈ ప‌రిణామాలు మంత్రిపై అనుమానాలు వ‌చ్చేలా చేశాయి. అస‌లే ‘ఓటును నోటు ఎర కేసు’లో రేవంత్ రెడ్డి చిక్కుకోవ‌డంతో టీడీపీ ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డింది. మూలిగేన‌క్క‌పై తాటిపండు చందంగా మంత్రి వ్య‌వ‌హారం టీడీపీని మ‌రింత ఇరుకున ప‌డేసింది. ఎట్ట‌కేల‌కు పోలీసులు ఈ కేసులో ‘పురోగ‌తి’ సాధించారు. ‘ఈ కేసులో దర్యాప్తు పూర్తయ్యింద’ని, కేసును క్లోజ్ చేశామని నరసాపురం డీఎస్పీ పి.సౌమ్యలత శుక్రవారం చెప్పారు. ఈ వ్యవహారంతో మంత్రికి సంబంధం లేదని, ఆమె ఇంటివద్ద డబ్బు సంచి వదిలివెళ్లిన ఆదాల విష్ణువతి కూడా అమాయకురాలేనని తేలిందన్నారు.
First Published:  5 Jun 2015 9:45 PM GMT
Next Story