Telugu Global
Others

వ్య‌భిచారం కేసులో న్యూస్ రీడ‌ర్!

టీవీ న్యూస్ రీడ‌ర్‌గా ప‌ని చేస్తున్న ఓ యువ‌తి వ్య‌భిచార కూపం న‌డుపుతూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయింది. యువ‌తుల‌ను మ‌భ్య పెట్టి వారిని ఉచ్చులో ఇరికించి ప‌డుపు వృత్తిలోకి దింపుతున్న విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. ఓ యువ‌తి రాసిన లేఖ ఆధారంగా పోలీసులు ఓ క‌న్ను వేసి విష‌యాన్ని ఛేదించ‌గ‌లిగారు. ఈ నేప‌థ్యంలో టీవీ న్యూస్‌రీడర్‌గా పనిచేస్తున్న సన్మ అనే ఈ కిలాడీ లేడిని అదుపులోకి తీసుకున్నారు. ఆమెతోపాటు మరో ఇద్దరు విటులను కూడా పోలీసులు అదుపులోకి […]

వ్య‌భిచారం కేసులో న్యూస్ రీడ‌ర్!
X
టీవీ న్యూస్ రీడ‌ర్‌గా ప‌ని చేస్తున్న ఓ యువ‌తి వ్య‌భిచార కూపం న‌డుపుతూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయింది. యువ‌తుల‌ను మ‌భ్య పెట్టి వారిని ఉచ్చులో ఇరికించి ప‌డుపు వృత్తిలోకి దింపుతున్న విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. ఓ యువ‌తి రాసిన లేఖ ఆధారంగా పోలీసులు ఓ క‌న్ను వేసి విష‌యాన్ని ఛేదించ‌గ‌లిగారు. ఈ నేప‌థ్యంలో టీవీ న్యూస్‌రీడర్‌గా పనిచేస్తున్న సన్మ అనే ఈ కిలాడీ లేడిని అదుపులోకి తీసుకున్నారు. ఆమెతోపాటు మరో ఇద్దరు విటులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి ఓ కంప్యూటర్, మూడు మెమొరీ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల క‌థ‌నం ప్ర‌కారం…. అనంతపురం జిల్లా కదిరి ఆర్‌ఎస్ రోడ్డుకు చెందిన ఓ యువతి ఇటీవల కనిపించకుండా పోయింది. దీనిపై యువతి తండ్రి పోలీసులను ఆశ్రయించాడు. తన కూతురు కనిపించకుండా పోయే ముందు స‌న్మ అనే న్యూస్‌రీడర్ తనను వ్యభిచార కూపంలోకి దింపి విటులతో నగ్నంగా ఉన్న దృశ్యాలను సెల్‌ఫోన్‌లో చిత్రీకరించి వాట్సప్ ద్వారా చాలా మందికి పంపిందని, తనకు జరిగిన అన్యాయం మరో యువతికి జరగకూడదన్న ఉద్దేశ్యంతో ఈ లేఖ రాసి సిగ్గుతో వెళ్ళిపోతున్నానంటూ ఓ లేఖ రాసి వెళ్లిందని బాధితురాలి తండ్రి తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. కాగా పోలీస్‌స్టేషన్ సిబ్బందిని ఆరా తీయగా.. తన కుమార్తె కనిపించడం లేదంటూ ఓ వ్యక్తి ఫిర్యాదు చేసిన మాట వాస్తవమేనని అంగీకరించారు. కేసు నుంచి స‌న్నాను త‌ప్పించే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్న‌ట్టు తెలుస్తోంది.
First Published:  6 Jun 2015 7:22 AM GMT
Next Story