Telugu Global
Others

పార్టీ మారే ప్రసక్తే లేదు: ఎంపీ మల్లారెడ్డి

తాను పార్టీ మారే ప్రసక్తే లేదని ఎంపీ మల్లారెడ్డి స్పష్టం చేశారు. తాను రాజకీయాలకు కొత్త అయినా చంద్రబాబునాయుడు తనకు ఎంపీగా అవకాశమిచ్చారని తెలిపారు. ఆయన నమ్మకాన్ని వమ్ము చేయనన్నారు. తన నియోజకవర్గానికి వచ్చినందుకే కేసీఆర్‌ను స్వాగతించానని, ఆయన చేస్తున్న మంచి పనులకు పొగిడినంత మాత్రాన తాను పార్టీ మారతానని అనుకోవడం పొరపాటని మల్లారెడ్డి అన్నారు. తాను పోటీ చేసిన నియోజకవర్గంలో దిగ్గజాలు పోటీ చేశారని, వారిని కాదని ఎంతో నమ్మకంగా ప్రజలు తనకు పట్టం గట్టారని, […]

తాను పార్టీ మారే ప్రసక్తే లేదని ఎంపీ మల్లారెడ్డి స్పష్టం చేశారు. తాను రాజకీయాలకు కొత్త అయినా చంద్రబాబునాయుడు తనకు ఎంపీగా అవకాశమిచ్చారని తెలిపారు. ఆయన నమ్మకాన్ని వమ్ము చేయనన్నారు. తన నియోజకవర్గానికి వచ్చినందుకే కేసీఆర్‌ను స్వాగతించానని, ఆయన చేస్తున్న మంచి పనులకు పొగిడినంత మాత్రాన తాను పార్టీ మారతానని అనుకోవడం పొరపాటని మల్లారెడ్డి అన్నారు. తాను పోటీ చేసిన నియోజకవర్గంలో దిగ్గజాలు పోటీ చేశారని, వారిని కాదని ఎంతో నమ్మకంగా ప్రజలు తనకు పట్టం గట్టారని, వారి నమ్మకాన్ని వమ్ముచేసి పార్టీ మారతాననుకోవడం పొరపాటేనని అన్నారు. తాను తెలుగుదేశం పార్టీకి ఎప్పుడూ కృతజ్ఞతతో ఉంటానని, కృతఘ్నుడిగా మారే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. పార్టీ మారే ప్రసక్తే లేదని మల్లారెడ్డి తేల్చిచెప్పారు.
First Published:  5 Jun 2015 1:20 PM GMT
Next Story