Telugu Global
Others

ఉద్యోగుల‌కు ఈ సెల‌వులు అద‌నం!

కేంద్ర ఉద్యోగులకు ఏడాదికి 21 క్యా జువల్‌ లీవులు ఉంటాయి. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో అదనపు సీఎల్‌ వినియోగించుకోవచ్చు. ఇందుకు సంబంధించి ఉద్యోగుల ఫండమెంటల్‌ రూల్స్‌ 85లో నాలుగో నిబంధనను సవరించారు. దీని ప్రకారం రక్తదానం చేసే ఉద్యోగులు ఆ సర్టిఫికెట్‌తో రెండు రోజులు సెలవు తీసుకోవచ్చు. పురుష ఉద్యోగులు వేసక్టమీ చేయించుకుంటే ఆరు రోజులు సెలవులు వాడుకోవచ్చు. ఉద్యోగి భార్య ట్యూబెక్టమీ చేయించుకుంటే ఆ ఉద్యోగి ఏడు రోజులు సెలవులు వినియోగించుకోవచ్చు. మహిళా ఉద్యోగులు ట్యూబెక్టమీ […]

కేంద్ర ఉద్యోగులకు ఏడాదికి 21 క్యా జువల్‌ లీవులు ఉంటాయి. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో అదనపు సీఎల్‌ వినియోగించుకోవచ్చు. ఇందుకు సంబంధించి ఉద్యోగుల ఫండమెంటల్‌ రూల్స్‌ 85లో నాలుగో నిబంధనను సవరించారు. దీని ప్రకారం రక్తదానం చేసే ఉద్యోగులు ఆ సర్టిఫికెట్‌తో రెండు రోజులు సెలవు తీసుకోవచ్చు. పురుష ఉద్యోగులు వేసక్టమీ చేయించుకుంటే ఆరు రోజులు సెలవులు వాడుకోవచ్చు. ఉద్యోగి భార్య ట్యూబెక్టమీ చేయించుకుంటే ఆ ఉద్యోగి ఏడు రోజులు సెలవులు వినియోగించుకోవచ్చు. మహిళా ఉద్యోగులు ట్యూబెక్టమీ చేయించుకుంటే 14 రోజులు సెలవులు తీసుకోవచ్చు. గర్భంలో పిండం చనిపోతే 14 రోజులు, పుట్టిన బిడ్డ పురిటిలోనే చనిపోతే 21 రోజులు సెలవులు తీసుకోవచ్చు. వీటిని సాధారణ సెలవులతో సంబంధం లేకుండా వాడుకోవచ్చున‌ని ప్ర‌భుత్వం ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది
First Published:  5 Jun 2015 1:18 PM GMT
Next Story