Telugu Global
Others

మ‌ల్లారెడ్డి చంద్ర‌బాబుపై అసంతృప్తితో ఉన్నారా?

మ‌ల్కాజిగిరి ఎంపీ చామ‌కూర మ‌ల్లారెడ్డి తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ను పొగ‌డ్త‌ల‌తో ముంచేశారు. ఓ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ఆయ‌న బంగారు తెలంగాణ కేసీఆర్‌తోనే సాధ్య‌మ‌న్నారు. తెలంగాణకు కేసీఆర్‌ రూపంలో మంచి ముఖ్యమంత్రి దొరికారనీ, కొత్త రాష్ట్రం అభివృద్ధిలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ బాగా పనిచేస్తున్నారనీ మల్లారెడ్డి కితాబిచ్చారు. జ‌రుగుతున్న‌ప‌రిణామాలు చూస్తుంటే తెలంగాణ‌లో టీడీపీకి ఉన్న ఒక్క‌గానొక్క ఎంపీ కూడా జారిపోతాడేమో అన్న‌ట్లుంది. మ‌ల్లారెడ్డి అసంతృప్తిగా ఉన్నారా? 2014లో మ‌ల్కాజిగిరి స్థానానికి టీడీపీ నుంచి టికెట్ సాధించారు మ‌ల్లారెడ్డి.  విద్యావేత్త‌, వాణిజ్య‌వేత్త‌గా […]

మ‌ల్లారెడ్డి చంద్ర‌బాబుపై అసంతృప్తితో ఉన్నారా?
X

మ‌ల్కాజిగిరి ఎంపీ చామ‌కూర మ‌ల్లారెడ్డి తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ను పొగ‌డ్త‌ల‌తో ముంచేశారు. ఓ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ఆయ‌న బంగారు తెలంగాణ కేసీఆర్‌తోనే సాధ్య‌మ‌న్నారు. తెలంగాణకు కేసీఆర్‌ రూపంలో మంచి ముఖ్యమంత్రి దొరికారనీ, కొత్త రాష్ట్రం అభివృద్ధిలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ బాగా పనిచేస్తున్నారనీ మల్లారెడ్డి కితాబిచ్చారు. జ‌రుగుతున్న‌ప‌రిణామాలు చూస్తుంటే తెలంగాణ‌లో టీడీపీకి ఉన్న ఒక్క‌గానొక్క ఎంపీ కూడా జారిపోతాడేమో అన్న‌ట్లుంది.

మ‌ల్లారెడ్డి అసంతృప్తిగా ఉన్నారా?

2014లో మ‌ల్కాజిగిరి స్థానానికి టీడీపీ నుంచి టికెట్ సాధించారు మ‌ల్లారెడ్డి. విద్యావేత్త‌, వాణిజ్య‌వేత్త‌గా తెలంగాణ‌లో ప్ర‌సిద్ధి చెందాడు. పైగా వియ్యంకుడు తీగ‌ల కృష్ణారెడ్డి పార్టీలో ముందు నుంచి ఉన్నాడు. దీంతో ఆయ‌న‌కు టీడీపీ టికెట్ ద‌క్కిందని ప్ర‌చారం జ‌రిగింది. దేశంలోనే అత్య‌ధిక ఓట‌ర్లున్న ఎంపీ నియోజ‌క‌వ‌ర్గంగా మ‌ల్కాజిగిరి జాతీయ‌స్థాయిలో మారుమోగింది. సెటిల‌ర్లు ఎక్కువ‌గా ఉండ‌టంతో రాష్ట్ర విభ‌జ‌న జ‌రిగిన నేప‌థ్యంలో అన్ని పార్టీలు ఈ నియోజ‌క‌వ‌ర్గంపై దృష్టి సారించాయి. తాను గెల‌వ‌డంతోపాటు, త‌న ప‌రిధిలో ఉన్న ఎమ్మెల్యేల‌ను గెలిపించుకోవ‌డంలోనూ మ‌ల్లారెడ్డి స‌ఫ‌లీకృతుల‌య్యారు. కానీ, ఎన్నిక‌ల స‌మ‌యంలో చంద్ర‌బాబు వ్య‌వ‌హార శైలిపై మ‌ల్లారెడ్డి గుర్రుగా ఉన్నార‌ని స‌మాచారం. అప్ప‌ట్లో మ‌ల్కాజిగిరి ఎంపీ స్థానానికి లోక్‌స‌త్తా అధినేత జ‌య‌ప్ర‌కాష్ నారాయ‌ణ కూడా పోటీ చేశారు. జేపీ నామినేష‌న్ వేసే ముందు చంద్ర‌బాబు మంత‌నాలు సాగించార‌ని, వారిద్ద‌రి మ‌ధ్య అవ‌గాహ‌న కుదిరాకే ఆయ‌న నామినేష‌న్ వేశార‌ని లోక్‌స‌త్తా నేత‌లే విమ‌ర్శించారు. జ‌నసేన అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ల్యాణ్‌, రాష్ట్ర బీజేపీ అగ్ర‌నేత‌లు మ‌ల్కాజిగిరిలో జేపీకి మ‌ద్ద‌తుగా ప్ర‌చారం చేయాల‌నుకోవ‌డం ఈ వాద‌న‌ల‌కు బ‌లం చేకూర్చింది. పైగా జేపీ బీజేపీకి ఓటేయాల‌ని కోరుతూ సికింద్రాబాద్‌లో బీజేపీకి మ‌ద్ద‌తుగా ప్ర‌చారం చేశాడు.

ప‌వ‌న్ క‌ల్యాణ్ ప‌ర్య‌ట‌న అందుకే ర‌ద్ద‌యిందా?

జరుగుతున్న ప‌రిణామాలు అప్ప‌ట్లో మ‌ల్లారెడ్డిని తీవ్ర మ‌నోవేద‌న‌కు గురిచేశాయ‌ని స‌మాచారం. త‌న‌కు టీడీపీ టికెట్ ఇచ్చినా మిత్ర‌ప‌క్షాలైన బీజేపీ, జ‌న‌సేన‌లు జేపీకి ఎలా ప్ర‌చారం చేస్తాయంటూ మ‌ల్లారెడ్డి తీవ్ర ఆగ్ర‌హానికి గుర‌య్యార‌ని తెలిసింది. ఇంద‌తా చంద్ర‌బాబు ప్ర‌మేయం లేకుండా సాగ‌డం లేద‌న్న విష‌యాన్ని మ‌ల్లారెడ్డి గుర్తించార‌ని స‌మాచారం. త‌న‌ను కీలుబొమ్మ‌ను చేసి ఆడిస్తే ఊరుకునేది లేద‌ని నేరుగా చంద్ర‌బాబు నాయుడుకే స్ప‌ష్టం చేసిన‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. ఇవ‌న్నీ నిజ‌మ‌నేలా.. ప‌వ‌న్ ప‌ర్య‌ట‌న షెడ్యూలు క‌న్నా స‌రిగ్గా అర‌గంట‌కు ముందు అర్ధాంత‌రంగా ర‌ద్ద‌యింది. త‌మ పార్టీ అధినేత సామాజిక వ‌ర్గ స‌మీక‌ర‌ణాల నేప‌థ్యంలో త‌న‌నే ఓడించి బ‌లిప‌శువు చేయాల‌నుకున్నార‌ని మ‌ల్లారెడ్డి భావిస్తున్నార‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ మొద‌లైంది. దీంతో గ్రేట‌ర్ ఎన్నిక‌ల‌కు ముందుగానే త‌న వియ్యంకుడు తీగ‌ల కృష్ణారెడ్డితో క‌లిసి టీఆర్ ఎస్‌లో చేరాల‌ని నిర్ణ‌యించుకున్నార‌ని ప్ర‌చారం జ‌రిగింది. ఇప్ప‌టికే తీగ‌ల పార్టీ మారాడు. గ్రేట‌ర్‌కు ముందు మ‌ల్లారెడ్డి కూడా పార్టీ మార‌తార‌ని జోరుగా ప్ర‌చారం సాగుతోంది.

First Published:  6 Jun 2015 1:57 AM GMT
Next Story