Telugu Global
National

ప‌రిశుభ్ర‌త‌కు ప‌క్కా చిట్కా!

స్వ‌చ్ఛ భార‌త్‌లో భాగంగా గుజ‌రాత్ ఓ వినూత్న కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుట్టింది. మామూలుగా మనం ఏ బస్టాండులోనో మూత్రానికి వెళ్తే రూపాయి.. ఒక్కోచోట రెండు రూపాయలో వసూలు చేస్తారు! అందుకే చాలా మంది సుల‌భ్ కాంప్లెక్స్‌ల‌కు వెళ్ళ‌కుండా ఎంచక్కా ఆరుబయట పని కానిచ్చేస్తుంటారు. దీనివల్ల దుర్వాసన, రోగాల ముప్పు తర్వాతి పరిణామాలు. వీటన్నిటికీ చెక్‌ పెట్టేందుకు గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (ఏఎంసీ) ఒక కొత్త ఐడియా వేసింది. ఆ నగరం మొత్తమ్మీదా బహిరంగంగా మూత్రవిసర్జన చేసేవారిని […]

ప‌రిశుభ్ర‌త‌కు ప‌క్కా చిట్కా!
X
స్వ‌చ్ఛ భార‌త్‌లో భాగంగా గుజ‌రాత్ ఓ వినూత్న కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుట్టింది. మామూలుగా మనం ఏ బస్టాండులోనో మూత్రానికి వెళ్తే రూపాయి.. ఒక్కోచోట రెండు రూపాయలో వసూలు చేస్తారు! అందుకే చాలా మంది సుల‌భ్ కాంప్లెక్స్‌ల‌కు వెళ్ళ‌కుండా ఎంచక్కా ఆరుబయట పని కానిచ్చేస్తుంటారు. దీనివల్ల దుర్వాసన, రోగాల ముప్పు తర్వాతి పరిణామాలు. వీటన్నిటికీ చెక్‌ పెట్టేందుకు గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (ఏఎంసీ) ఒక కొత్త ఐడియా వేసింది. ఆ నగరం మొత్తమ్మీదా బహిరంగంగా మూత్రవిసర్జన చేసేవారిని గుర్తించి, వారు తాము నిర్వహించే టాయిలెట్లను వినియోగించుకుంటే రూపాయి ఎదురు ఇస్తామని ప్రకటించింది. ఆరు బ‌య‌ట టాయ్‌లెట్ల‌కు వెళ్ళేవారిని ఇలా క‌ట్ట‌డి చేస్తుంద‌న్న మాట‌. బాగుంది క‌దా!
First Published:  5 Jun 2015 1:09 PM GMT
Next Story